‘పులివెందుల రౌడీ’ వెనుక పోలీసులు పడతారు – చంద్రబాబు!

Chandrababu naidu TDP mahanaduగత తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలన అంతా ‘నవ్వు’ అనే పదానికి దూరంగా జరిగింది. చంద్రబాబు నవ్వితే అది గ్రేట్ అన్న విషయాన్ని రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చెప్పుకున్న వైనం అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు ప్రస్తుత పాలన అంతా నవ్వుల మయం అవుతోంది. మరో రకంగా చెప్పాలంటే… నాడు వైఎస్ ‘ఎటకారపు’ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. సరిగ్గా అదే ఫార్ములాతో చంద్రబాబు కూడా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ చలోక్తులు విసురుతూ సాగుతోంది.

తాజాగా ‘మహానాడు’ వేదికగా చంద్రబాబు చేసిన కామెంట్లు పార్టీ నేతలను ఉత్సాహపరిచాయి. పులివెందులలో ఉన్నవారంతా మంచి వాళ్ళే కానీ, ఓ రౌడీ మాత్రం అక్కడుండి రౌడీయిజం చేస్తున్నాడు అని చంద్రబాబు వ్యాఖ్యానించగానే తెలుగుదేశం కార్యకర్తలంతా ఫక్కున నవ్వేసారు. ఇక నుండి రాష్ట్రం మొత్తం సీసీ కెమెరాలు పెడుతున్నామని, అలాగే రౌడీషీటర్లు ఫోటోలు, వేలిముద్రలు తీసుకుంటున్నాము, ఎవరైనా రౌడీషీటర్ ఓ ప్రాంతానికి వస్తే రెండు నిముషాల్లోనే అలర్ట్ వస్తుందని, పులివెందుల రౌడీ ఇక్కడికి వచ్చాడంటే పోలీసులు వారిని వెంబడిస్తారని చంద్రబాబు నవ్వుతూ చేసిన వ్యాఖ్యలకు మహానాడు వేడుక మొత్తం ప్రతిస్పందనగా నవ్వులతో స్పందించింది.

ADVERTISEMENT

కాస్త ఎటకారంతో కూడిన ఈ మాటలు వైసీపీ వర్గాలను బాగానే తాకుతాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ‘పులివెందుల రౌడీ’ అనే ట్యాగ్ లైన్ ను చేర్చడం ప్రసంగానికే హైలైట్ గా మారింది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. బాబు సృష్టించిన ఈ ప్రకంపనలకు వైసీపీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి!

ADVERTISEMENT
Latest Stories