ఈయన వయసు 75…. నమ్మశక్యంగా లేదే!

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వయసు 75 ఏళ్ళు… అంటే అందరూ అవుననే అంటారు. ఎందుకంటే అది నిజమే కనుక.

కానీ ఈ వయసులో ఆయన ఇంట్లో కూర్చొని ‘కృష్ణా రామా…’ అనుకుంటూ కాలక్షేపం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు.

ADVERTISEMENT

కానీ ఆయనకు ఈ ఉచిత సలహా ఇచ్చిన జగనే తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లు గిరగిర తిరిగేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్ళి ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్‌ని కలిసి అభినందించారు.

ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యి సాస్కి పధకం కింద ఏపీకి చెల్లించాల్సిన రూ.5,000 కోట్లు విడుదల చేయాలని కోరారు.

ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉన్నారనుకుంటే, ఈరోజు ఉదయం పెద్దాపురంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ కార్యక్రమం ముగించుకొని అక్కడే ఓ ప్రభుత్వ పాఠాశాలలోకి వెళ్ళి అక్కడి విద్యార్ధులతో మాట్లాడారు. వారు చేస్తున్న ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకొని అభినందించారు.

అక్కడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ పక్క వీధిలోకి వెళ్ళారు. రోడ్డుపై హటాత్తుగా ముఖ్యమంత్రి ఎదురయ్యే సరికి ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. ఆయన వారితో మాట్లాడి సెల్ఫీ దిగారు.

ఎటువంటి ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా సిఎం చంద్రబాబు నాయుడు తమ వీధిలోకి వచ్చారనే విషయం తెలిసేసరికి ఒక్కసారిగా వీధిలో అందరూ ఆయన చుట్టూ చేరిపోయారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరింఛి తిరుగు ప్రయాణం అయ్యారు.

గతంలో జగన్‌ బటన్ నొక్కుడు సభకు వెళ్తే ఎంత హడావుడి జరిగేదో అందరూ చూశారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంత కూల్‌గా ప్రజల మధ్యకు వస్తున్నారు. నేటికీ అయన మంత్రులలో అతి కొద్ది మంది తప్ప మిగిలినవారు ఈవిదంగా సామాన్య ప్రజలతో మమేకం కాలేకపోతున్నారు!

సిఎం చంద్రబాబు నాయుడు ఈవిదంగా తరచూ సామాన్య ప్రజల మధ్యకు వస్తుండటం వలన వారికి ఆయన పట్ల అభిమానం పెరుగుతుంది. ఆ అభిమానమే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది.

ఈవిషయం కూటమి ప్రభుత్వంలోని మంత్రులతో సహా దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా గ్రహిస్తే మంచిది. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటరిగా ఉంటున్న యువకుడు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడం చాలా చాలా అవసరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

37 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

57 minutes ago