Telugu

ఈసారి దావోస్ పర్యటనలో దబిడి దిబిడే

ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో ప్రపంచ దేశాల ఆర్ధిక సదస్సు జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బృందం బయలుదేరుతోంది. ఈ సదస్సులో 18 దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు బృందం సమావేశాలకు అపాయింట్‌మెంట్స్ ఖరారయ్యాయి కూడా. మరో 7-8 దేశాల ప్రతినిధులతో సమావేశాలను ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సిఎం చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి పరిశ్రమలను, ఐటి కంపెనీలను ప్రోత్సాహిస్తారనే మంచి పేరుంది. ముఖ్యంగా కేంద్రం ఏపీకి సహాయసహకారాలు అందిస్తోంది. అందువల్లే కేవలం ఆరు నెలల్లోనే ఏపీలో సుమారు రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.

ADVERTISEMENT

వీటి గురించి సదస్సులో చెప్పుకొని, ఏపీలో పరిశ్రమలు, ఐటి కంపెనీల ఏర్పాటుకి మంచి అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సాహిస్తోందని చెప్పుకుని పెట్టుబడులు ఆకర్షించవచ్చు.

ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ మొదలవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కి ఏవిదంగా ఐటి కంపెనీలు తీసుకువచ్చారో, ఆదేవిదంగా ఇప్పుడు అమరావతికి కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. కనుక అమరావతిలో ఐటి కంపెనీలు స్థాపించేందుకు ఇదే సరైన తరుణమని ఐటి కంపెనీలు గ్రహిస్తే భారీగా పెట్టుబడులు పెట్టవచ్చు.

విశాఖలో ఐటి కంపెనీలతో పాటు విశాఖ, విజయవాడలో మెట్రో కారిడార్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. కనుక మెట్రో రైల్ రంగంలో ఉన్న సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చు.

ఏపీ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ, సీసీ కెమెరాలు, డ్రోన్స్ తయారీ సంస్థలు, ఫార్మా , ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యాటక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.

కనుక ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు, అన్నివిదాల చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. కనుక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ కంపెనీలు ఈసారి ఏపీకి మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు బృందం ఈ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించగలిగితే, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి సాధించగలుగుతుంది. రాబోయే మూడేళ్ళలో ఏపీ రూపురేఖలే సమూలంగా మారిపోయే అవకాశం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

4 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

6 hours ago