
ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టి సాయంత్రానికి దాదాపు 97 శాతం మందికి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొనడం విశేషం.
శ్రీసత్యసాయి జిల్లా గుండుమాల గ్రామంలో ఓబులమ్మ అనే నిరుపేద మహిళ ఇంటికి సిఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొని ఆమె చేతికి పింఛన్ సొమ్ము అందించారు.
గతంలో ఉదయం 5 గంటలకు వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తే ఎంతో పొంగిపోయేవారు వృద్ధులు, మహిళలు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు కనుక్కొని రూ.4,000 పింఛన్ చేతిలో పెడుతుంటే ఆ ఆనందమే వేరు కదా?
తన వంటి నిరుపేద ఇంటికి సిఎం చంద్రబాబు నాయుడు రావడం, యోగక్షేమాలు అడగడం, స్వయంగా పింఛన్ సొమ్ము చేతికి అందివడం ఎన్నటికీ మరిచిపోలేనని ఓబులమ్మ అన్నారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తూ బయటకు వచ్చినప్పుడు పరదాల మాటున తిరిగి వెళ్ళిపోతుండేవారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబందాలు లేకుండా కూడా చేశారు.
కానీ ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో ప్రత్యక్ష సంబందాలు నెలకొల్పుకొని వారి అభిమానం, నమ్మకం పొందేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం సిఎం చంద్రబాబు నాయుడు రాజకీయ చతురతకి నిదర్శనం కాదా?
సిఎం చంద్రబాబు నాయుడు గుండుమల గ్రామ సభలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మేము పాలకులం కాము ప్రజల సేవకులం అని చెప్పడానికే ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా ఇదేవిదంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటున్నాను.
గత ప్రభుత్వం అమరావతి, పోలవరం పనులు పూర్తి చేసి ఉండి ఉంటే రాష్ట్రానికి ఎంతో పేరు, ప్రయోజనం కలిగి ఉండేవి. కానీ రాజకీయకక్షతో వాటిని నిలిపివేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించింది. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఈవిదంగా చేయడం బాధ్యతారాహిత్యమే కదా?అంటూ సిఎం చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళ జగన్ పాలనలో జరిగిన ఆర్ధిక, సామాజిక విధ్వంసం గురించి వివరించారు.
“గత 5 ఏళ్ళలో పాలన ఎలా ఉండకూడదో అందరూ చూశారు. ఈ 5 ఏళ్ళలో పాలనలో ఎలా ఉండాలో మేము చూపిస్తాము,” అని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాలకులు గ్రహించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి… అని సిఎం చంద్రబాబు నాయుడుకి తెలుసు కానీ జగన్ తెలుసుకోలేకపోయారు. ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా జగన్ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించడమే విడ్డూరం. జగన్ ధోరణి వైసీపి పాలిట శాపంగా మారగా ఆయన ధోరణిని కూడా అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు.
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…