కోర్టులు, కేసులు మనకి కొట్టిన పిండే… అయినా బాబుని ఏమీ చేయలేక పోయామే?

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు కావస్తోంది. అమరావతి నిర్మించలేక మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది. పోలవరం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుంది. ఉన్న పరిశ్రమలు పారిపోతే కొత్తవాటిని తేలేకపోయింది. ఉద్యోగాలు కల్పించలేకపోయింది. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు జీతాల పెంపు కోరుతూ రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు.

సరే… రాజధాని, పోలవరం వైసీపికి చేత కాని పనులు… అప్పు తెచ్చిన డబ్బంతా సంక్షేమ పధకాలకే సరిపోవడం లేదు కనుక జీతభత్యాలకు ప్రభుత్వం చేతిలో సొమ్ము లేదు కనుక వైసీపి నేతలు సమర్ధించుకోవచ్చు.

ADVERTISEMENT

కానీ వైసీపికి కోర్టులు, పోలీసులు, కేసులు, విచారణలు, బెయిలు, అరెస్టులు కొట్టిన పిండే కదా?అందుకే అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు, రాజధాని కేసులను గుడుగుడుగుంచం… అన్నట్లు తిప్పగలుగుతోంది.

ఆ నేర్పు ఉన్నందునే కదా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి లోపల వేయగలిగింది. నారా లోకేష్‌తో సహా టిడిపి ముఖ్యనేతలందరిపై కేసులు నమోదు చేసి లోపల వేసేయాలని కూడా ప్రయత్నించింది. కానీ జగన్‌ ప్రభుత్వం ఈ పని కూడా పూర్తిచేయలేకపోవడం విచిత్రమే కదా?

జగన్‌ ప్రభుత్వం పెట్టిన మద్యం కేసు, ఇసుక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులలో చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు నేడు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అంటే చంద్రబాబు నాయుడుని కేసులలో ఇరికించేసి ఎన్నికల సమయంలో జైల్లో పడేద్దామనే ఈ ఐడియా కూడా బెడిసికొట్టిందన్న మాట!

కోర్టు కేసులలో ఇంత అపార అనుభవం, ఇంత జ్ఞానం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసులతో జగన్‌ ప్రభుత్వం చివరికి ఏమైనా సాధించిందా అంటే అదీ లేదు. ఈ కేసులతో చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలని జైలుకి పంపించలేకపోయినా కనీసం వారిపై అవినీతిపరులనే ముద్రలు వేద్దామనుకుంటే, ఈ కేసుల వలననే చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో సానుభూతి, జగన్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడం దేవుడి స్క్రిప్టే కదా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Jailer 2: Shoot Wrapped, But Rajini Is Back

Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…

10 minutes ago

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ…

దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…

16 minutes ago