చంద్రబాబుకి ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం దాస్తోంది?

చంద్రబాబు అరెస్టుతోనే అల్లాడుతున్న బాబు కుటుంబసభ్యులు, పార్టీ క్యాడర్ ఇప్పుడు బాబుకి అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డీహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబుకి తాజాగా చర్మ సంబంధిత అనారోగ్య సమస్య వచ్చినట్టు డాక్టర్లు నిర్దారించారు.

ADVERTISEMENT

చంద్రబాబు 5 కేజీల బరువు కూడా దగ్గరంటూ భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి X మాధ్యమం ద్వారా ప్రజలతో పంచుకున్నారు. వయస్సు రీత్యా ఇంకా బరువు తగ్గటం ఆయన మూత్రపిండాల పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ బ్రాహ్మణి తన ఆవేదనను సామజిక మాధ్యమంలో పంచుకున్నారు.

చంద్రబాబు జైలు గదిలో దోమలు, అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు ఉండడంతో ఇన్ఫెక్షన్ సోకి చర్మ సంబందిత అనారోగ్యాలు రావడం, బరువు తగ్గడంతో నీరసం – అలసటతో ఆయన బాధపడుతున్నారని లోకేష్, బాబు పరిస్థితిని ప్రజల ముందుంచారు. చంద్రబాబుకి సకాలంలో వైద్య సదుపాయాలు అందించడంలో ఈ ప్రభుత్వం జాప్యం చేస్తుందని, బాబుకి ఏమైనా అయితే అందుకు పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే అవుతుందంటూ హెచ్చరించారు.

అసలు చంద్రబాబుకి జైలులో ఏం జరుగుతుంది? ప్రభుత్వ వైద్యులు, అధికారులు ఏం దాస్తున్నారు? అంటూ ప్రభుత్వాన్నిలోకేష్ తన X మాధ్యమం ద్వారా ప్రశ్నించారు.బాబుకి స్టెరాయిడ్స్ ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, బాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత జగన్ దే అంటూ చెప్పుకొచ్చారు లోకేష్.

బాబు కుటుంబసభ్యుల పోస్టులతో టీడీపీ శ్రేణులలో బాబు ఆరోగ్యం పట్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బాబు అరెస్టుతో గడిచిన నెల రోజుల నుండి రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు, అరెస్టులు, జైళ్లు, బైళ్ళు తప్ప మరేమి జరగడం లేదు. ఇటువంటి సందర్బాల్లో బాబుకి అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

దీనితో బాబు అనారోగ్యం పట్ల జగన్ ను కలసి వినతి పత్రం ఇవ్వడానికి బుద్ధా వెంకన్న,పిల్లి మాణిక్యలరావు మరికొంతమంది టీడీపీ నేతలు తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం, పోలీస్ వారు టీడీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ హైటెక్షన్ వాతావరణం నెలకొంది.

కనీసం ఇటువంటి సందర్భంలో అయినా ప్రభుత్వం ముందుకొచ్చి తమ వాదనని వినిపించి బాబు ఆరోగ్యం పట్ల అటు కుటుంబసభ్యలకు, ఇటు ప్రజలకి పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపొతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది.

ఏది ఏమైనప్పటికి ఒక విజనరీ నాయకుడికి ఇటువంటి పరిస్థితి వస్తుంది అన్న విజన్ ఉహకుకూడా రాకపోవచ్చు.అందుకే అంటారు కాబోలు రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

11 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

19 minutes ago