
అయితే ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలోని నార్త్ వాళ్ళు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో ఐటీని ఉరుకులు పరుగులు పెట్టించినప్పటి లాగా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ గురించే ఇప్పుడు అక్కడ చర్చ అంతా. విజయవాడలోని రియల్ టైమ్ గవర్నెన్స్ మీటింగ్ రూమ్ నుండి చంద్రబాబు తన కాబినెట్ మంత్రులతో సమీక్ష చేస్తున్న ఫోటోలు చూసి ఇదంతా.
ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఏ రాజకీయనాయకుడైన ఇంత టెక్నాలజీని వాడారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. పనిలో పనిగా వారి సొంత రాష్ట్రాల సీఎంలకు చురకలు కూడా అంటిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ని ఉరుకులు పరుగులు పెట్టించిన రోజులు గురించి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఒక్కరిద్దరైతే ఆయన ప్రధాని కావలసిన నేత అని కితాబు ఇచ్చారు కూడా. అదే రియల్ టైమ్ గవర్నెన్స్ రూమ్ ను నిన్న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు, గవర్నర్ నరసింహన్ కు దగ్గరుండి చూపించారు చంద్రబాబు. ఒక గదిలో కూర్చుని రాష్ట్రంలో జరుగుతున్న పాలనను, పధకాలను అన్ని ఎలా సమీక్షిస్తున్నారో చూసి వారిద్దరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దీనిగురించి రాష్ట్రపతి తన ట్విట్టర్ లో ప్రముఖంగా ప్రస్తావించారు కూడా.
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…