
ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయమని కోరడం సర్వసాధారణ విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో అనేక సార్లు ఇవే పనుల మీద ఢిల్లీ వెళ్ళివచ్చానని చెప్పుకున్నా, ఏనాడూ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేది ఒక్కటీ సాధించుకు రాలేకపోయారు.
ఎందువల్ల అంటే, ఆయన ప్రాధాన్యతలు వేరు గాబట్టి! ఆయన ఎంతసేపు సంక్షేమ పధకాలకు అప్పులు ఇప్పించమని లేదా తమ కేసులలో ఊరట కల్పించమని కోరుతుండేవారు. కేంద్రం కూడా ఆయన ఏమి కోరుకుంటున్నారో అవే ఇచ్చి సాగనంపుతుండేది.
ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారు కూడా. కనుక కేంద్ర ప్రభుత్వం పట్ల కూడా రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుండేది.
కానీ టిడిపి, జనసేన, బీజేపీలు పొత్తులు పెట్టుకొని, ఎన్నికలలో గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారాయి. వాటికనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోంది. అంటే అద్దం ఎదుట ఏముంటే అది ప్రతిభింబించిన్నట్లు అనుకోవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని ఆ తర్వాత రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్ శాఖల మంది అశ్వినీ వైష్ణవ్‌ని కలిశారు. ఆయన చాలా పెద్ద జాబితాతోనే వారిని కలిశారు. వాటిలో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు ఒకటి.
రాష్ట్ర విభజన సమయంలో ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు సాకారం కాలేదు. కానీ పాలకులకు నిబద్దత ఉంటే ఏదైనా సాధ్యమే అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెంటనే అంగీకరించారు. డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ధానికి శకుస్థాపన చేసేందుకు అంగీకరించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన నిలిపివేసి దానిని స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సమస్యని శాస్వితంగా పరిష్కరించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
అమరావతికి రాష్ట్రంలో, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలతో కలుపుతూ రైల్వేలైన్, రోడ్లు నిర్మించాలని సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతి-విశాఖ, నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు హైస్పీడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.
సిఎం చంద్రబాబు నాయుడు జాబితాలో సెమీ కండక్టర్స్, డ్రోన్లు, సీసీ కెమెరాల తయారీ పరిశ్రమల స్థాపన, వాటిలో ఉద్యోగాల కొరకు తగిన నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు వంటివి చాలానే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చేతిలో సిఎం చంద్రబాబు నాయుడు పెద్ద జాబితా పెట్టినంత మాత్రన్న ఆ పనులన్నీ చకచకా చేసేస్తుందని ఆశ పడక్కరలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమేమి అవసరమో, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో, వాటి వలన కలిగే ప్రయోజనలు ఏమిటో కేంద్రానికి స్పష్టత వస్తుంది. కనుక అందుకు తోడ్పడే అవకాశాలు పెరుగుతాయి.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం నుంచి ఏమి కోరకూడదో జగన్మోహన్ రెడ్డి చూపిస్తే, ఏమేమి కోరి పొందవచ్చో సిఎం చంద్రబాబు నాయుడు ఆచరణలో చూపిస్తున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడుకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన, ఆసక్తి కలిగి ఉండటం, వాటి ఏర్పాటుకి చొరవ తీసుకునే గుణం, ఆలోచనలు ఉండటం ఆంధ్రప్రదేశ్ అదృష్టమే అని చెప్పవచ్చు.
కనుక ఈ 5 ఏళ్ళలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, రాజకీయ వాతావరణం ఇదేవిదంగా సానుకూలంగా ఉంటే, 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయి అభివృద్ధిపదంలో దూసుకుపోవడం తధ్యం.
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…