
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపితో పొత్తులు ఉండవని, టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణలో టిడిపి అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పారు. ఏపీలో బిజెపితో పొత్తులపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని కనుక ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయని కనుక అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
టిడిపితో పొత్తులకు బిజెపి ఇష్టపడటం లేదని వైసీపీ చేస్తున్న వాదనల గురించి విలేఖరులు అడిగినప్పుడు, “మా రెండు పార్టీల మద్య అంతర్గతంగా ఏమి చర్చలు జరుగుతున్నాయో వాళ్ళకేమి తెలుసు?అందుకే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. టిడిపి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందనే సంగతి వాళ్ళకి కూడా తెలుసు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చడంతో ఆ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది. ఈ విషయం బిజెపి అధిష్టానానికి తెలియదనుకోలేము. తెలంగాణలో లక్షలాదిమంది ఆంద్రా ప్రజలు స్థిరపడి ఉన్నారు. కనుక హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి కొన్ని ప్రాంతాలలో నేటికీ టిడిపి ఓటర్లను ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంది. అయినా బిజెపికి సాయపడేందుకు ముందుకు వస్తున్న టిడిపిని వద్దనుకోవడం నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే దీనికి బలమైన కారణమే ఉంది. ఒకవేళ టిడిపితో బిజెపి పొత్తులు పెట్టుకొంటే, వెంటనే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని వాదిస్తున్న కేసీఆర్, ఇప్పుడు మోడీ-చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నారంటూ ప్రచారం చేస్తే బిజెపి నష్టపోతుంది. అయితే టిడిపితో బిజెపి ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకపోయినా పరోక్షంగా సహకారం తీసుకోవచ్చు.
ఒకవేళ తెలంగాణలో టిడిపి సహకారంతో బిజెపితో అధికారంలోకి వచ్చినా లేదా ఎక్కువ సీట్లు సాధించగలిగినా, అప్పుడు ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకోవచ్చు లేదా కేంద్రప్రభుత్వం టిడిపికి అన్ని విదాలా సహకరించవచ్చు. ఒకవేళ తెలంగాణలో బిజెపి దారుణంగా ఓడిపోయినా అది కూడా టిడిపి పట్ల బిజెపి వైఖరిని మార్చవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మారే రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకొంటామని చంద్రబాబు నాయుడు చెప్పారనుకోవచ్చు.
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…