షా చేతుల్లో ఏపీ బీజేపీ భవిష్యత్‌… ఏం చేస్తారో?

Chandrababu Naidu Pawan Kalyan Amit Shah

టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళి గురువారం అర్దరాత్రి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన బీజేపీకి 7 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్ల కోసం పట్టుబట్టిన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

కానీ దాని వలన తమ కూటమి నష్టపోతుందని, బీజేపీ కోల్పోయే ప్రతీ సీటు వైసీపి దక్కించుకుంటుందని కనుక 3-4 ఎంపీ, 5-6 ఎమ్మెల్యే సీట్లతో సర్దుకుపోవాలని చంద్రబాబు నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ నేడు వారు మరోమారు భేటీ అయ్యి సీట్ల సర్దుబాట్లపై ఓ అవగాహనకు వస్తే ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు అవుతుంది. ఎన్డీయేలో టిడిపి మళ్ళీ చేరుతుంది. ఏపీలో టిడిపి, జనసేనలతో కలిసి పనిచేసేందుకు బీజేపీ పెద్దలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ సీట్ల సర్దుబాట్లు అవరోధంగా నిలుస్తున్నాయి. కనుక నేటి సమావేశం చాలా కీలకం కానున్నది.

ఈసారి ఎన్డీయే కూటమి 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంగా టిడిపి వంటి పాత మిత్రులను కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. టిడిపి, జనసేనలు అందుకు సిద్దంగానే ఉన్నాయి కనుక అవి గెలుచుకునే ఎంపీ సీట్లు ఎన్డీయే పద్దులోనే ఉంటాయి. కనుక ఏపీ బీజేపీ 3-4 సీట్లు తీసుకొన్నా ఎటువంటి నష్టమూ ఉండదు కానీ వాటిని కూడా గెలుచుకోలేకపోతేనే ఎక్కువ నష్టం కలుగుతుంది.

ఏపీలో బీజేపీ ఎన్ని సీట్లు తీసుకున్నప్పటికీ వాటిని సొంతంగా గెలుచుకునే సత్తా కూడా ఉండాలి. ఎందుకంటే టిడిపి, జనసేనల మద్య ఓట్ల బదిలీ అయ్యేందుకు 75 శాతంపైగా అవకాశం ఉంటుంది కానీ వాటి ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ నేపధ్యంలో అది ఓడిపోయే ప్రతీ సీటు వైసీపికే దక్కుతుంది. కనుక బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోతే వైసీపిని గెలిపించిన్నట్లవుతుంది కూడా.

సీట్ల కోసం పట్టుబడుతూ ఏపీలో ఒంటరిగా మిగిలిపోయి నష్టపోవడం లేదా ఏపీని భ్రష్టు పట్టించేస్తున్న వైసీపితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పోటీ చేయడం కంటే టిడిపి, జనసేనలతో సీట్ల సర్దుబాట్లు చేసుకొని ఏపీలో అధికారంలోకి రాగలిగితే బీజేపీకి రాజకీయంగా ఎక్కువ లాభపడుతుంది. అప్పుడే ఏపీలో బీజేపీ పుంజుకొని తెలంగాణ రాష్ట్రంలోలాగా బలపడగలుగుతుంది. కనుక అమిత్ షా సీట్ల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించి, ఏపీ బీజేపీకి మేలు చేస్తారనే ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories