
విచారణ జరపాలి అంటూ కొంత కాలం, విచారణ పూర్తి కాలేదు అంటూ మరి కొంత కాలం, ఆధారాలు తెస్తాము గడువు కావాలని, ఆధారాలు సమర్పిస్తాము సమయం ఇవ్వాలని సిఐడి అధికారులు, ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కేసుని ముందుకు తీసుకెళ్తున్న తీరు తెలుదేశం నాయకుల ఆశల పై నీళ్లు చల్లుతున్నట్లే కనిపిస్తుంది.
సెప్టెంబర్ 10 న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన బాబు గడిచిన 25 రోజులనుండి బెయిలు కోసం ప్రయత్నించడం నిరాశ చెందడం పరిపాటిగా మారిపోయింది. బాబు జ్యూడిషయల్ రిమాండ్ నేటితో ముగుస్తుండడంతో ఈ కేసు మళ్ళి కోర్ట్ మెట్లెక్కింది. బాబు రిమాండ్ ను పొడిగించాలంటూ సిఐడి అధికారులు మెమో జారీచేయగా అందుకు విజయవాడ ఏసీబీ కోర్ట్ ఈనెల 19 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
“కథ కంచికి మనమింటికి” అన్నట్లుగా “వాదనలు కోర్టుకి బాబు రిమాండుకి” అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. “వై నాట్ చంద్రబాబు”… చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది. బెయిలు మీద దశబ్దాల పాటు రాష్ట్రంలో తిరుగుతున్న నాయకులు లేరా? హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వారు ఇప్పుడు బెయిలు మీద తిరగడం లేదా? వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలకు ముందస్తు బెయిల్లు,ఆరోపణలతో జైలుకు వెళ్లిన వారికి బెయిలు దొరుకుతుంది కానీ ‘వై నాట్ చంద్రబాబు’, అనే ప్రశ్నకు సమాధానం మాత్రం టీడీపీ శ్రేణులకు దొరకడం లేదు.
Niti Taylor, who is familiar to Telugu audiences through films like Mem Vayasuku Vacham directed…
BRS leader Harish Rao has launched a sharp attack on Telangana Chief Minister Revanth Reddy…