ఇకనైనా పంచాయితీలకు ఫుల్ స్టాప్ పడుతుందా.?

రాష్ట్ర విభజన జరిగి దశబ్ద కాలం పూర్తయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొలిక్కి రాని పంచాయితీలు ఇప్పటికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వేడిని రేపుతూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికలకు ఆ మంటలో రాజకీయ పార్టీలు చలి కాచుకుంటూనే వస్తున్నాయి.

ADVERTISEMENT

రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన సందర్భంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఇద్దరు కూడా సామరస్య పూర్వకంగా సమస్యల పరిష్కరానికి ముందుకు వచ్చినా అవి రాజకీయ రంగు పులుము కోవడంతో ఒక పరిధి దాటాక ఆ చర్చలకు ఫుల్ స్టాప్ వేసారు ఇద్దరు ముఖ్యమంత్రులు.

ఆ తరువాత ఏపీలో కేసీఆర్ ఆశించిన ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పటికైనా రెండు రాష్ట్రాల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకున్న రెండు రాష్ట్రాల ప్రజలకు పరిష్కారం కాదు కొనసాగింపు చూపించారు కేసీఆర్, జగన్ లు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా రెండు రాష్ట్రాలలో తాము రాజకీయంగా ఎటువంటి లబ్ది పొందడం లేదు అనే ఉద్దేశంతో చూసిచూడనట్టు మిన్నకుండి పోయింది.

ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారాయి…కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే లో టీడీపీ పాత్ర కీలకంగా ఉంది, అలాగే ఏపీలో బీజేపీ కూడా కూటమి బలంతో వికసించింది. కాబట్టి ఈసారి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలలో సమస్యలకు ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ నెల 6 వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా భేటీ అవుతున్నారు. దీనితో రాజకీయ పార్టీలు, నాయకులు, విశ్లేషకుల నుండి రెండు రాష్ట్రాల ప్రజల వరకు అందరి ద్రుష్టి వీరిద్దరి భేటీ మీదే ఉంది. పార్టీల పరంగా ఇద్దరిది భిన్న దారులు అయినా వీరిద్దరికి వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికి గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నాయి.

కాబట్టి గత ప్రభుత్వాల మాదిరి రాజకీయ లబ్ది ఆశించి కాలయాపన చేయకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు నాయకులు ఒక అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల విభజన పంచాయితీలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంది.

నేడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి తమ తమ రాష్ట్రాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల పైన పథకాల పైన చర్చలు జరిపారు. అలాగే కేంద్రం పరిధిలో ఉన్న విభజన సమస్యలను కూడా తక్షణమే పరిష్కారం చూపాలని బీజేపీ పెద్దలకు వినతులు కూడా సమర్పించారు ఇద్దరు ముఖ్యమంత్రులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Kobali: Ajay–Atul Set the Tone for Ranabaali

Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…

15 minutes ago

Ramayana Release Date is Confirmed!

Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…

45 minutes ago