
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సొంతం చేసుకుంది. కొన్ని కొన్ని జిలాల్లో వైసీపీ ఆనవాలు కూడా లేకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసి వైసీపీ పై తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
అయితే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కూటమి 94% విన్నింగ్ రేట్ తో దూసుకుపోగా, మండల పరిషత్ ఎన్నికల్లో 90% స్ట్రైక్ రేట్ ను సాధించింది. కూటమి ఈ స్థాయి విజయం సాధించినప్పటికీ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో పార్టీ బీ ఫార్మ్ మీద పోటీ చేయలేకపోయిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగి కొన్ని కొన్ని స్థానాలలో తమ ఉనికి చాటుకున్నారు.
అయితే అటువంటి రెబల్ అభ్యర్థులకు కూటమిలోకి రీ ఎంట్రీ ఉండదని, వారు ప్రజల మద్దతుతో విజయం సాధించినప్పటికీ పొత్తు ధర్మానికి విరుద్ధంగా కూటమి నుంచి బయటకు వెళ్లారని, అటువంటి వారికి కూటమి ద్వారాలు తెరవబోదని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టేసారు.
దీనితో మూడు పార్టీల రెబల్ అభ్యర్థులు ఇప్పుడు గెలిచినా ఓడినట్టేనా అన్న చర్చ నడుస్తుంది. కూటమి రెబల్స్ కి ప్రజల మద్దతు ఉన్నా, వారు పొలిటికల్ గా తన మార్క్ చూపించినా అది కూటమి ధర్మానికి పూర్తి విరుద్ధమని, ఇలా పార్టీలో సీట్లు రాని వారందరు రెబల్స్ గా బరిలోకి దిగితే ఇక పార్టీలు ఎలా మనుగడ సాగిస్తాయని,
మూడు పార్టీలలోనూ గెలిచే సమర్థమైన అభ్యర్థులు ఎందరో ఉన్నప్పటికీ వారందరు కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి సీట్ల సర్దుబాటులో త్యాగం చేసారని, అటువంటి వారికీ ఎన్నికలలో పోటీ చేయకున్నా పార్టీ తరుపున మంచి గుర్తింపు లభిస్తుందని సీఎం బాబు నిర్మొహమాటంగా తేల్చి చెప్పేసారు. మరి ఇప్పుడు గెలిచిన కూటమి రెబల్స్ దారెటు.?
Rebelsకి Re-entry లేదు.. Chandrababu క్లారిటీ!
Rebelగా గెలిచిన వాళ్లను ప్రజలు Accept చేయొచ్చు.. కానీ తిరిగి పార్టీలోకి తీసుకోవడం కూటమి ధర్మం కాదు!
-@ncbn @JaiTDP @JanaSenaParty https://t.co/bAF2MGwEjz
— M9 NEWS (@M9News_) November 9, 2026
SS Rajamouli's Varanasi seems to have a much bigger connection with the Ramayana than initially…
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర గణాంకాలను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే…