జగన్ కన్నా ముందు ‘గొడ్డలి’ వస్తుందంటా…బాబు పంచులు..!

పామర్రులో టీడీపీ నిర్వహించిన ప్రజాగళంలో జగన్ మీద గళం విప్పిన చంద్రబాబు పంచులు, కౌంటర్లతో వైసీపీ పై విమర్శల దాడి చేస్తూ సభాప్రాంగణంలో నవ్వులు పూయించారు. ఏడు పదుల వయస్సులోనూ ఎంతో ఉషారుగా యువకుడి మాదిరి మండుటెండలను కూడా లెక్కచేయక కూటమి గెలుపుకి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు బాబు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో భాగంగా రోజుకు రెండు, మూడు బహిరంగ సభలలో పాల్గొంటూ స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే తన ప్రసంగాలలో చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ మాదిరి ఎక్కడికి వెళ్లినా ఒకటే ఆవు పాఠంలా అదే స్క్రిప్ట్ చదవకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యల పై స్పందిస్తూ, సభా స్థలికి వచ్చిన ప్రజలను ఉత్తేజపరుస్తూ తన ప్రత్యర్థి పార్టీ నేతల పై ఛలోక్తులు విసురుతూ, ప్రజలకు ఆసక్తి కలిగేలా స్లొగన్స్ ఇస్తూ తన సభలను నిర్వహిస్తున్నారు బాబు.

పామర్రు ప్రజాగళంలో బాబు మాట్లాడుతూ…ఈ ఐదేళ్ల కాలంలో ప్యాలస్ లో పాలన చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్నాడు. ఇన్నాళ్లు బటన్ నొక్కడానికి బయటకు వచ్చే ఈ బటన్ ముఖ్యమంత్రి ఆకాశంలో తిరుగుతూ నెల మీద చెట్లను నరికించాడు. పరదాల చాటున ఉన్న పరదాల మనిషి ఇప్పుడు పరదాల నుంచి బయటకు వచ్చి కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు అంటూ జగన్ పై కౌంటర్లు వేశారు.

అలాగే ఎక్కడికైనా జగన్ వచ్చే ముందు అక్కడికి జగన్ కన్నా ముందుగా ‘గొడ్డలి’ వస్తుంది…అవునా కాదా తమ్ముళ్లు…మీరు ఈ విషయం గమనించారా..? అంటూ జగన్ పర్యటనల ముందు ఆయా ప్రాంతాలలో గొడ్డలితో నరికిన చెట్ల ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ఈ ముఖ్యమంత్రిగారి పర్యటన ఫలితంగా స్కూల్ లకు సెలవలు ఇచ్చాడు, రోడ్ల మీద కర్ఫ్యూ పెట్టాడు చూసారుగా తమ్ముళ్లు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

నా జీవితంలో రాజుల గురించి, రారాజులా గురించి చరిత్రలో చవివాను కానీ ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారి ఇటువంటి సైకో పోవాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో తల మీద చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి అవ్వగానే బాదుడే బాదుడు అంటూ అన్ని చార్జీలు పెంచి గుద్దులు గుద్దాడు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ నినదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రాష్ట్రానికి రానివ్వకుండా అడ్డుకోవడం, ఆయనను కించపరుస్తూ మాట్లాటడం చూస్తుంటే పవన్ ఫాలోవర్స్ అందరు ఒక్కసారి తలుచుకుంటే జగన్ బొచ్చు మొత్తం పీకేస్తారు. ఏంటి ఈ దౌర్జన్యం, ఎందుకు ఇంత అహంకారం, అధికారం ఉందనే అహంతో జగన్ చేస్తున్న అరాచకాలకు ఈ ఎన్నికలతో సమాధి కట్టాలన్నారు.

ఇలా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలతో ఆద్యంతం తన ప్రత్యర్థి జగన్ పై చేస్తున్నవిమర్శలు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండడంతో వీక్షిస్తున్న ప్రజలు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ అబ్బాయిని ప్రశ్నించిన తీరు..,తన రాజకీయ అవసరాల కోసం గొడ్డలితో సొంత బాబాయ్ నే లేపేసిన జగన్ కు మనమొక లెక్కా తమ్ముళ్లు…, తనకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న సొంత చెల్లెలుపై వ్యక్తిగత దాడి చేస్తున్న ఈ జగన్ రాష్ట్రంలో ఆడపడుచులకు ఎలా అన్న అవుతాడు అంటూ ఇచ్చిన స్లొగన్స్ ప్రజలలోకి బలంగా చేరుకున్నాయి.

అలాగే ఇప్పుడు జగన్ కన్నా ముందు గొడ్డలి వస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గత ఎన్నికలలో ‘గన్ కన్నా ముందు జగన్ వస్తాడు’ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తే ఇప్పుడు ‘జగన్ కన్నా ముందు గొడ్డలి వస్తుంది’ అంటూ బాబు చెప్పడంతో అసలు వైసీపీకి సరైన కౌంటర్ అంటే ఇది కదా అంటూ టీడీపీ శ్రేణులు ఈ స్లోగన్ ను కూడా ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Vijay’s Message to His Haters: See You at the Success Meet

Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…

26 minutes ago

Finally, Pressure Starting On Jagan And Co?

YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…

56 minutes ago