
ఏపీలో వైఎస్ షర్మిల రాకతో రాజకీయ బలాబలాలు మారబోతున్నాయి. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేయించి ఆమెను ఏపీ కాంగ్రెస్, ఏపీ రాజకీయాలలోకి రప్పించారని, ఆమె ద్వారా జగన్ కుటుంబంలో, వైసీపిలో చిచ్చుపెట్టి విడగొట్టి దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని వైసీపి నేతలు అప్పుడే తమ అధినేత జగన్ పాటకు కోరస్ పాడుతున్నారు.
జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడు ఇంతగా ప్రభావితం చేయగలిగితే నేడు ఆయన ప్రతిపక్షంలో కూర్చొని ఉండేవారే కాదు కదా?
వైఎస్ షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని, వైసీపిని వీడి ఎందుకు తెలంగాణకు వెళ్ళిపోయారో అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే రేపు ఆమె ఏపీకి వచ్చిన తర్వాత స్వయంగా వివరించి చెపుతారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఏపీలో కూడా మళ్ళీ బలపడాలని అనుకొంటున్నప్పుడు, వైఎస్ షర్మిల ఇందుకు పనికివస్తారని భావించి, ఏపీ పగ్గాలు అప్పజెపుతోంది.
వైఎస్ షర్మిలకు కూడా రేవంత్ రెడ్డిలాగా కష్టపడితే తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వగలననే ఆశ, నమ్మకం రెండూ ఉన్నాయి. కనుక ఈ పదవి ఆమెకు బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీకి ఆమె అవసరం ఉంది. ఆమెకు కాంగ్రెస్ అవసరముంది. కనుకనే ఆమెకు, కాంగ్రెస్‌కు మద్య జరిగిన ఈ ఈ ఒప్పందంలో చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబందమూ లేదని అర్దమవుతూనే ఉంది. కనుక ఆయనని నిందించాల్సిన అవసరం కూడా లేదు.
కానీ ఈ పరిణామాలన్నీ చంద్రబాబు నాయుడుకి, టిడిపి, జనసేనలకు అనుకూలంగామారుతుండగా, వైసీపికి చాలా ప్రమాదకరంగా మారుతుండటం వలననే జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతూ, దీనికీ చంద్రబాబు నాయుడునే నిందిస్తున్నారని భావించవచ్చు.
ఇక ఏపీలో మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిలతో దోస్తీ చేయడం మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగుతుంది కదా? అంటే అలా అనుకోనవసరం లేదు.
త్వరలో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ తోడ్పాటు కూడా లభిస్తే వైసీపిపై విజయం సాధించడం మరింత సులువు అవుతుందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారని మోడీ, అమిత్ షాలకి కూడా తెలుసు.
వారికి తెలుసనే విషయం చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు. కనుక కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకోకుండా తన రాజకీయ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించవచ్చు.
ఏపీలో టిడిపి, జనసేనలు అధికారంలోకి రావాలా లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డే రావాలని మోడీ, అమిత్ షాలు కోరుకుంటున్నారా అంటే టిడిపి, జనసేనలే అని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపి ఇంకా ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా జగనే ముఖ్యమంత్రిగా ఉంటారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కనుక!
అదే… టిడిపితో కలిసి జనసేన అధికారంలోకి రాగలిగితే భవిష్యత్‌లో జనసేనతో కలిసి ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం ఏర్పడుతుంది కనుక!
ఇక ఏపీలో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాల నేపధ్యంలో టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకొంటుందా లేక వాటికి దూరంగా ఉంటూనే సహకరిస్తుందా?అనేది త్వరలోనే తేలిపోతుంది.
ఒకవేళ దూరంగా ఉంది టిడిపి, జనసేనలకు సహకరించాలనుకుంటే, “ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ తద్యం” వంటి మూస డైలాగులతో ఏపీ బీజేపీ ఒంటరిగా పోటీకి సిద్దపడితే టిడిపి, జనసేనలకు యధాశక్తిని తోడ్పడేందుకే అని భావించవచ్చు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…