
అధికార యంత్రాంగంతో కలిసి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వెళ్ళగా.., ఈ సందర్భంగా అధికారులు వేసిన అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సవివరంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇంటిలో తాను, తన కుమారుడు లోకేశ్ మాత్రమే ఉన్నామని, మిగిలిన వారి వివరాలను తర్వాత తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సర్వేలో అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు చెప్పిన సమాధానాలు ఇవి…
ఆధార్ కార్డు నెంబరు : 300300688099
నివాసం : ఆర్సీసీ శ్లాబ్ (ప్రభుత్వ క్వార్టర్)
విస్తీర్ణం : 5 వేల చదరపు అడుగులు
శాశ్వత నివాసం ఉందా?: లేదు
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు: ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ తదితరాలన్నీ
పెళ్లైందా?.. పెళ్లి నాటికి వయసు: అయ్యింది. 30 ఏళ్లు
చదువు : ఎంఏ (ఆర్థిక శాస్త్రం)
ఎక్కడ: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఉద్యోగం: లేదు
వృత్తి : రాజకీయం
ప్రస్తుత హోదా : ముఖ్యమంత్రి
వార్షికాదాయం: రూ.36 లక్షలు
ఈ సందర్భంగా తనకు ఉద్యోగం లేదని జవాబు చెప్పిన చంద్రబాబు… నీవేమైనా ఇస్తావా? అని ఎన్యూమరేటర్ తో చమత్కరించారు. ఈ కామెంట్ తో షాక్ తిన్న సదరు ఎన్యూమరేటర్ నోరు విప్పేలోగానే మరోమారు చంద్రబాబే అందుకుని… “నన్ను నిరుద్యోగి అనుకుని సంక్షేమ పథకాలు ఏమైనా మంజూరు చేసేవు. నీ ఉద్యోగం పోతుంది” అని చంద్రబాబు అనడంతో సదరు ఎన్యూమరేటర్ తో పాటు అక్కడున్న వారంతా నవ్వేశారు.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…