
2019 ఎన్నికల ముందు అమరావతి రాజధాని, ఇక్కడే నేను ఇళ్లు నిర్మించుకున్నాను, వైసీపీ వస్తే రాజధానిని ఇక్కడ నుంచి మార్చేస్తాం అంటూ ఆరోపిస్తున్న టీడీపీ మాటలు నమ్మాల్సిన పని లేదు, వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు అద్భుత రాజధాని నిర్మాణం చేపడతాం అంటూ హామీలిచ్చి జగన్ అధికారంలోకి రాగానే ఎలా మాట తప్పారో…ఏవిధంగా మడం తిప్పారో అందరికి తెలిసిన సంగతే.
జగన్ అధికారంలోకి వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చివేతలో మొదలుపెట్టిన రాజధాని విధ్వంసం మూడు రాజధానుల పేరుతో జరిగిన మూడు ముక్కలాటతో ముగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఆమోదించిన వైసీపీ, అధికారంలోకి రాగానే వర్షం వస్తే రాజధాని మునిగిపోతుతుందని, ఇక్కడ రాజధానిని నిర్మిస్తే వరదల బారిన పడుతుందని, అసలు నిర్మాణాలకు ఈ నేల సరిపడదని, అమరావతిని స్మశానాలతో పోలుస్తూ ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు అమరావతి పై విమర్శలు చేసి అటు అమరావతితో పాటు ఏపీ భవిష్యత్తుని కాలరాసేసారు అంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టాయి.
ఇందులో నేరం ఎవరు చేసారు, శిక్ష ఎవరు అనుభవించారు అని తెలుసుకునే లోపే ఐదేళ్ల ఏపీ ప్రజల భవిష్యత్తు వైసీపీ ఆడిన రాజకీయ చదరంగంలో నలిగిపోయింది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లుగా అమరావతి పై చిమ్మిన విషంకు ఈరోజు ఫైనల్ టచ్ ఇచ్చారు. నాడు అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన రాజధాని నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. దీని పై స్పందించిన చంద్రబాబు ఇక మీరు మారారా..? మీ బుద్ధి మార్చుకోరా..? మీ వికృత పోకడలు ఇంటికి వెళ్లే ముందు కూడా సరిదిద్దుకోరా..? విధ్వంసం, విషం చిమ్మే మీ నీచమైన చర్యలు మానుకోరా..? అంటూ వైసీపీ పై మండిపడ్డారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూల్చివేతలతోనే ముగుస్తుంది అంటూ వైసీపీ ని హెచ్చరించారు బాబు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…