Telugu

రాష్ట్రంలో వైసీపీ దొంగలు పడ్డారంటా….జాగ్రత్త తమ్ముళ్లు..!

‘తెలుగు సేన జెండా’ పేరుతో టీడీపీ – జనసేన పార్టీలు నిర్వహిస్తున్న తాడేపల్లి సభలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైసీపీ దొంగలు పడ్డారు జాగ్రత తమ్ముళ్లు అంటూ రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

భవిష్యత్తు కోసం ముందడుగు వేయాలంటే గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటూ 2014 ఎన్నికలో పోటీ చేయకుండా టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ బాబు పవన్ ను కొనియాడారు.

ADVERTISEMENT

విభజనతో దెబ్బ తిన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రజలకిచ్చిన ఐదేళ్ల అధికారాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఎంచుకుని, కేంద్రం నుంచి 11 ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చాం. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నిలివ్వాలని ప్రయత్నించాం.

ఇటువంటి ప్రయత్నాలకు 2019 ఎన్నికలు బ్రేక్ వేసాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అహం తో రాష్టాన్ని సర్వ నాశనం చేసారు. తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టుకోవడానికి, రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్లలో జరగడానికి టీడీపీ – జనసేన పొత్తు అనివార్యం అనేది ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు అర్ధం చేసుకుని కలిసి కట్టుగా పని చేయాలంటూ బాబు రెండు పార్టీల నేతలకు హితవు పలికారు.

జెండా సభ ప్రారంభించాడని ముందు జనసేన జెండాని తానూ తీసుకుని టీడీపీ జెండాను పవన్ కళ్యాణ్ కు అందించారు బాబు. దీనితో తానూ మాటల వ్యక్తిని కాదని చేతల వ్యక్తిని అనేది మరోసారి రుజువు చేసుకున్నారు బాబు. పొత్తు ధర్మానికి అసలైన అర్ధం చెప్పి రెండు పార్టీల క్యాడర్ ను సంతృప్తి పరిచారు చంద్రబాబు.

టీడీపీ – జనసేన కూటమి తరుపున పోటీ చేసే వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు, సంస్కారవంతులు. వైసీపీ పార్టీ తరుపున సీట్లు అందుకున్న నేతలు బూతుల నేతలు, మాఫియా నేతలు. మీకు సేవ చేసే నాయకులు కావాలా..? సంధి పేరుతో దోపిడులు చేసే నాయకులు కావాలో ఆలోచించుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే రాష్ట్రంలో వైసీపీ దొంగల ముఠా పడింది. గడిచిన నాలుగున్నరేళ్ళగా ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాను దోచుకుంటుంది. ఇక ఈ వైసీపీ దొంగల ముఠాను మీ ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టే సమయం వచ్చింది తమ్ముళ్లు జాగ్రత్త అంటూ పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచారు బాబు. ఇన్నాళ్ల కూటమి నిశ్శబ్దాన్ని ఒక్క సభతో బద్దలు కొట్టారు బాబు.

Photos: TDP-Janasena Mega Meeting Highlights

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Andhra Local Polls: Political Heirs Eye Key Posts

The upcoming local body elections in Andhra Pradesh are putting political families back in the…

14 minutes ago

SDT19: Sai Durgha Tej, Teja Kakumanu and Anil Sunkara Join Hands

Sai Durgha Tej, filmmaker Teja Kakumanu and producer Anil Sunkara are joining hands for #SDT19.…

38 minutes ago