Telugu

రక్తంతో తడిచిన పార్టీ జెండా..! కుడి ఎడమైతే తప్పదు భారీ మూల్యం…!

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి ధ్వంసమైన అన్న కాంటీన్లు., ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు.., మూతపడిన దుకాణాలు., నిలిచిపోయిన పాఠశాలలు. కుప్పంలో ఎన్నడూ చూడని విధంగా పరిస్థితులు మారిపోయాయి అంటూ చంద్రబాబు తన ఆవేదనను తెలియచేసారు.

కార్యకర్తల రక్తంతో తడిచిన తెలుగుదేశం జెండాను చూపిస్తూ చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నిలదీశారు. రక్తంతో తడిచిన ఈ పసుపు జెండా పోలీసుల రక్త దాహానికి నిదర్శనంగా మిగిలింది..,అంటూ ఆవేశంగా ప్రసంగించారు. దౌర్జన్యాలు చేసేవారి పై విరగాల్సిన లాఠీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి పై విరగడం దేనికి సంకేతం…? ప్రజల నుండి జీతాలు తీసుకుంటున్న ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడడానికా..? లేక రక్తాలు కారేట్లు గా ప్రజల తలలు పగలకొట్టడానికా..? అంటూ కాకి బాసుల పై బాబు ఘాటైన ప్రశ్నలను సంధించారు.

ADVERTISEMENT

ఉద్యోగులు కూడా ఆత్మ సాక్షిగా తమ విధులు నిర్వహించాలి అంటూ సూచన చేశారు. ఈ రక్త దాహానికి కారకులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు అంటూ బాబు పోలీస్ వారిని హెచ్చరించారు. కుప్పంలో జరిగిన ఈ దౌర్జన్య కాండను ప్రశ్నిస్తూ నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా వైసీపీ కి హెచ్చరికలు జారీ చేశారు. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో జగన్.., కుప్పం జోలికి వస్తే మీ వైసీపీ అల్లరిమూకల తాట తీస్తాం అంటూ టీడీపీ కార్యకర్తలలో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

మీరు కొట్టారు… నేను తీసుకున్నా.., నా టైం వస్తది అప్పుడు నేను బలంగా తిరిగిస్తా…! అంటూ ఎన్నికల ముందు జగన్ చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయ్యి ఇపుడు టీడీపీ నేతలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు కూల్చారు… మేము కడతాము.., మీరు కొట్టారు… ఇది కూడా గుర్తుంచుకుని వడ్డీతో సహా చెలిస్తాము అంటూ టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసురుతున్నారు.

ఎప్పుడు టైం ఒకరికే తల వంచదు..,జగన్ మోహన్ రెడ్డి మీ టైం దగ్గర పడింది…, మీకు మీ పార్టీ అరాచక శక్తులకు తప్పదు భారీ మూల్యం అంటూ అచ్చెం నాయుడు పత్రిక సమావేశంలో పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి…,ప్రశ్నించే వారిపై దాడులు చేయాలి.., అక్రమాల పై గొంతెత్తిన వారి పై కేసులతో అణచివేయాలి…. అంటూ రాజకీయాలు చేయడం అధికార పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

పక్క పార్టీ నేతలను లాక్కోవాలి..,బయపెట్టాలి అంటూ ఎంత గట్టిగా తొక్కితే బంతిలాగా అంత బలంగా లేస్తారు అనేది జగన్ 67 సీట్ల నుండి 151సీట్లకు వచ్చిన వైనాన్నే గుర్తుతెచ్చుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఇటువంటి ప్రతీకార – విద్వేష పూరిత రాజకీయాలు చేయడం ఏ రాజకీయ పార్టీకి అంత మంచిది కాదు. దాని వలన తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ దీర్ఘ కాలిక మనుగడ కష్టమవుతుంది.

రాష్ట్రానికి భవిష్యత్ కూడా లేకుండా పోతుంది. “రక్తం తో మొదలైన చరిత్ర రక్తంతోనే ముగుస్తుంది” అనే పెద్దల మాటలు అన్ని పార్టీలు.., అందరు నాయకులు గుర్తుంచుకోవాలని సామాన్యుడి ఆకాంక్ష.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwak’s #CULT Trailer: Thrills n Chills

Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…

12 minutes ago

Spirit Poster Trolls: Deepika Fans Target Vanga Again?

Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…

60 minutes ago