
పిఠాపురం నుంచి నేను పోటీ చేయబోతున్నాను అంటూ పార్టీ ఆవిర్భావదినోత్సవం రోజు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మ, అతని అనుచరులు చేసిన రచ్చ ‘చిలికి చిలికి గాలి వాన’గా మారుతుంది అంటూ ఆశించిన వైసీపీ కి బ్లూ మీడియాకు అది ‘టీ కప్ లో తుఫాన్’ మాదిరి చల్లబడిపోవడంతో చేతికొచ్చిన పండు చేజారినట్లు తెగ భాదపడిపోతున్నారు వైసీపీ నాయకులు.
పిఠాపురం పంచాయితీకి ముగింపు పలకడానికి వర్మ ను ఉండవల్లి బాబు నివాసానికి ఆహ్వానించారు బాబు. పొత్తు ధర్మానికి కట్టుబడి ఆ సీటుని జనసేన కు కేటాయించడం జరిగిందని.., అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవబోతున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద కూడా ఉంటుందని అందుకు పిఠాపురం టీడీపీ నాయకత్వం సహకరించాలంటూ బాబు వర్మను ఒప్పించారు.
ఇందుకు గాను మీరు చేసిన త్యాగానికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామనంటూ వర్మకు హామీ ఇవ్వడంతో వర్మ కూడా బాబు మాటలకు తన ఆమోదాన్ని తెలియచేసారు. పిఠాపురం నుండి పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను తీసుకుంటున్నాను అంటూ బాబు సాక్షిగా జనసైనికులకు భరోసా కల్పించారు వర్మ.
బలమైన టీడీపీ పునాదుల పై పవన్ ను గెలిపించి బాబు మెచ్చుకునేలా భారీ మెజారిటీతో పవన్ కు పిఠాపురం సీటును గిఫ్ట్ గా ఇవ్వడానికి మేము సిద్ధం అంటూ వర్మ ఆమోద ముద్ర వేయడంతో ఈసారి పవన్ విజయం నల్లేరు మీద నడక మాదిరి అనేది స్పష్టమయ్యిపొయింది. ఇక మెజారిటీ మీదే ద్రుష్టి కేంద్రీకరించాలి టీడీపీ – జనసేన నాయకులు.
అయితే ఈ రోజు వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ లిస్టులో పిఠాపురంనుండి వంగా గీత ను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపనున్నారు. గతంలో పీఆర్పీ సమయంలో వంగా గీత పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. అయితే అన్న పార్టీ తరుపున గెలిచిన అదే గీతను ఇప్పుడు తమ్ముడు పవన్ మీద పోటీకి సిద్ధం చేసారు జగన్. టీడీపీ నేతల అసమ్మతితో ఈసారి కూడా పవన్ ను ఓడించాలి అనుకున్న వైసీపీ ఆశలకు…ప్రచారాలకు వర్మ ఎండ్ కార్డు వేయడంతో ఇక నెక్స్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారు వైసీపీ బృందం.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…