
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను కేంద్రాన్ని వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, పెండింగ్ ప్రాజెక్టులను, పరిశ్రమలకు ప్రోత్సహకాలు, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్ర నుండి రావాల్సిన ఆర్థిక సాయం మీద కేంద్ర పెద్దలతో చర్చించి విభజన సమస్యల పరిష్కారానికి సూచనలు చేసే అవకాశం ఉంది.
ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించడంతో ఈసారి కేంద్రం నుండి అనుకున్నంత స్థాయిలో రాష్ట్రానికి నిధులు సేకరించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే ఎన్డీయే లో టీడీపీ పాత్ర కీలకం కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటూ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు హోదా రాజకీయం మొదలుపెట్టాయి.
ఇదిలా ఉంటే జగన్ ఊహించని ఫలితాన్ని ఏపీ ప్రజలు వైసీపీ కి కట్టబెట్టడంతో గత ఐదేళ్లుగా వైసీపీ పై ప్రజలకు ఏ స్థాయిలో మండిందో ఆ పార్టీ నేతలకు, అధినేతకు స్పష్టంగా తెలిసొచ్చింది. దీనితో కొన్నాళ్ళు ఏపీకి దూరంగా ఉండడం మంచిదని భావించిన జగన్ తన బెంగుళూర్ ప్యాలస్ కు పయనమయ్యారు. గతంలో నోరేసుకు పడిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా సైలెంట్ అవుతున్నారు.
ఓటమి తరువాత ఏపీ నుండి బెంగుళూర్ కు వెళ్లిన జగన్ నేడు తిరిగి తాడేపల్లి ప్యాలస్ కు రానున్నారు. గత ప్రభుత్వంలో జగన్ అండతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన నేతలందరూ మూకుమ్మడిగా కాషాయ కండువా కప్పుకోవడానికి ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సమయంలో ఇటు జగన్ ఏపీకి రావడం అటు బాబు ఢిల్లీకి వెళ్లడంతో ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు మలుపు తిరగనున్నాయా.? అనే సందేహాలు మొదలయాయ్యి.
There is a common misconception about movie collection figures. Fans often add GST to box-office…
Cinematographer Shamdat is making his Telugu directorial debut with the psychological thriller Don’t Sleep,…