జగన్, పవన్ అండ్ బిజెపికి జ్ఞానోదయం అయినట్లేనా!

Chandrababu Naidu UNOఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో నుండి చంద్రబాబును దించడమే లక్ష్యంగా పనిచేస్తోన్న వైసీపీ అధినేత జగన్ – జనసేన అధినేత పవన్ – బిజెపి అధిష్టానంలు తప్పక చూడాల్సిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ఇచ్చే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడుని హీరో స్థాయిలో కీర్తిస్తూ ఇచ్చిన పరిచయ సన్నివేశాలు షేర్ చేసుకుంటూ తెలుగు తమ్ముళ్ళు హంగామా చేస్తున్నారు.

ADVERTISEMENT

[m9ad]

‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై తెలుగులో ప్రసంగం ఆరంభించిన చంద్రబాబు… రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదని, పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

అమ్మ జన్మ మాత్రమే ఇస్తే… భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందని, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని, ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు వారంతా గర్వించదగ్గ ఈ విషయంపై బిజెపికి మద్దతు ఇస్తోన్న జగన్, పవన్ లు ఏమంటారో? ఏ విధమైన విమర్శలు చేస్తారో?!

ADVERTISEMENT
Latest Stories