
మంత్రులు చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపై అమరావతి కేంద్రంగానే పాలన సాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు.
డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు తెలియజేశారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేసి రైతు సోదరులను సంతోష పరచగా, అమరావతిలో తొలి సంతకం డ్వాక్రా రుణమాఫీలపై చేసి మహిళామణులను సంతృప్తి పరిచారు.
Andhra Pradesh chief minister, Chandrababu Naidu is one of the senior most leaders in Indian…
The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…