ఆత్మవిశ్వాసంతో బాబు… నిరాశగా జగన్‌

సాధారణంగా అధికారంలో ఉన్నవారు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో తనకు తిరుగే లేదన్నట్లు మాట్లాడుతుంటారు. అదే… ప్రతిపక్షనేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇటీవల సిఎం జగన్మోహన్‌ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను గమనిస్తే ఇందుకు పూర్తి భిన్నంగా వారు మాట్లాడటం కనిపిస్తుంది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వైసీపి-జగన్‌ రాజకీయాలతో సహా రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు.

ADVERTISEMENT

‘టీవీ9 తెలుగు’ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రతీ ప్రశ్నకు తడబడుతూ జవాబులు ఇచ్చారు. ఐదేళ్ళు రాష్ట్రాన్ని చాలా గొప్పగా పాలించానని, ఈసారి 175 ఎమ్మెల్యే సీట్లు మేమే గెలుచుకుంటామని చాలా నమ్మకంగా చెపుతున్న జగన్మోహన్‌ రెడ్డిని ఇంటర్వ్యూలో అదే ప్రశ్న అడిగితే ‘వైనాట్?’ అని ఎదురు ప్రశ్నించారే తప్ప తమ పార్టీ అన్ని సీట్లు ఎందుకు, ఏవిదంగా గెలుచుకుంటుందో చెప్పలేకపోయారు. జగన్‌ మాటలలోనే కాదు ఆయన మొహంలో తీవ్ర నిరాశ, నిస్పృహలతో చాలా స్పష్టంగా కనిపించాయి.

ఇద్దరి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డా లేక చంద్రబాబు నాయుడా?అనే అనుమానం కలుగక మానదు.

వేమూరి రాధాకృష్ణ చాలా నిర్మొహమాటంగా చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలిగించే అనేక ప్రశ్నలు అడిగితే వాటికి ఆయన ఏ మాత్రం తడబడకుండా సమాధానాలు చెప్పారు.

అదే… టీవీ9 ఎడిటర్ రజనీకాంత్ ‘కుటుంబ సంబంధాల’ గురించి అడిగిన ఓ చిన్న ప్రశ్నకు కూడా ‘నాది చాలా చిన్న ప్రపంచం’ అంటూ వైఎస్ షర్మిల, విజయమ్మల ప్రస్తావన రాకుండా సమాధానం దాటవేశారు.

చంద్రబాబు నాయుడు బయట రోడ్ షోలలో ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారో, వేమూరి రాధాకృష్ణతో కూడా అంతే ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. కానీ బయట సింగిల్ సింహం, పులి, అర్జునుడు అంటూ గర్జించే జగన్మోహన్‌ రెడ్డి టీవీ9 స్టూడియోలో చాలా బేలగా కనిపించారు.

ఇటీవలే తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్‌లని కూడా టీవీ9 రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. రేవంత్‌ రెడ్డి ఎప్పటిలాగే ప్రతీ ప్రశ్నకు చాలా ఆత్మవిశ్వాసంతో, ధాటిగా సమాధానాలు చెప్పగా, కేసీఆర్‌ కూడా ప్రతీ ప్రశ్నకు తనదైన శైలిలో చాలా ధాటిగానే జవాబులు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోవడం, ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం తదితర విచారణలు జరిపిస్తోంది. అవన్నీ కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం చాలా ఖాయంగా కనిపిస్తోంది.

ఓ పక్క అధికారం కోల్పోయి బిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు. మరో పక్క తలపై కత్తిలా వ్రేలాడుతున్న ఈ కేసులున్నాయి. అయినా ఇంటర్వ్యూలో కేసీఆర్‌ ఏమాత్రం భయపడకుండా ‘వాటన్నిటినీ చిల్లర రాజకీయాలని కొట్టిపడేసి, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని’ చాలా నిబ్బరంగా చెప్పారు.

కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి, మళ్ళీ ఖచ్చితంగా తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డి మాటలలోనే కాదు కనీసం హావాబావాలలో కూడా ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసం కనిపించలేదు.

ఇక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరి ఇంటర్వ్యూలకు వచ్చిన ‘లైక్స్’లో కూడా ఏకంగా లక్షల్లో తేడా ఉంది. చంద్రబాబు నాయుడు మాట్లాడినా తీరుపై సర్వత్రా ప్రశంశలు కురుస్తుంటే, జగన్మోహన్‌ రెడ్డి మాటలని కనీసం వైసీపి సొంత సోషల్ మీడియాలో కూడా గట్టిగా సమర్ధించుకోలేకపోయిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

ఇద్దరి ఇంటర్వ్యూలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని, జగన్మోహన్‌ రెడ్డి ఆ పదవిలో నుంచి దిగిపోబోతున్నారనే భావన చూసినవారికి కలిగితే ఆశ్చర్యం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Dhruv Rathee Alleges He Was Kidnapped From Home

YouTuber Dhruv Rathee has alleged that he was taken from his home on October 10…

11 minutes ago

Anirudh’s Paradise Failure Now Haunts Jailer 2 Hopes

Recently, the much-anticipated interview of Jailer with its cast and crew took place, during which…

41 minutes ago