
Chandrababu Naidu on YSRCP
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ గురించి వినపడే మాటలు.. రాజధాని ఆమరావతి, పోలవరం నిర్మాణ పనులు, వెలిగొండ, పట్టిసీమ ద్వారా నీళ్ళు అందించడం, లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ఐటి కంపెనీలు, రాష్ట్రాభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు.
కానీ ఇప్పుడు నామినేషన్స్, ఆ ప్రక్రియలో ఘర్షణలు, అల్లర్లు, విధ్వంసం, కోర్టు కేసుల గురించి ఎక్కువగా వినబడుతున్నాయి.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంపై ఎల్‌ఎల్‌ఎల్‌నినో ప్రభావం గురించి ఆందోళన చెందుతుంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీ చేస్తున్న ఆరాచకాల ప్రభావం రాష్ట్రాభివృద్ధిపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు ప్రభావాలు రాష్ట్రాలకు తీరని నష్టం కలిగించేవే. ఒకటి ప్రకృతి వలన ఏర్పడింది కాగా రెండోది ఒకే ఒక వ్యక్తి వలన ఏర్పడిందని సిఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు ఉండవల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు అరాచక పాలన సాగింది. కనుక పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడ్డారు.
ఇప్పుడు వైసీపీ అధికారంలో లేనప్పటికీ మళ్ళీ అటువంటి అరాచక పరిస్థితులను సృష్టిస్తోంది. ఇందుకోసం పంజాబ్, యూపీ, బీహార్ నుంచి గూండాలను తీసుకువస్తోంది. తద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా భయపడే పరిస్థితి కల్పిస్తోంది.
ఓ పక్క క్షేత్రస్థాయిలో విధ్వంసం సృష్టిస్తూనే, మరోపక్క కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ, పిటిషన్లు వేస్తూ ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
“వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ చాలా డిఫరెంట్. జగన్‌కు క్రిమినల్ మెంటాలిటీ బాగా ఉంది. సొంత చెల్లెలు కూతురు పెళ్ళిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జగన్ కంస మామే కదా?” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, పనితీరులో కూడా చాలా తేడా ఉంది. జగన్ క్రిమినల్ మెంటాలిటీయే వైసీపీలో చాలా మందికి ఉంది. కనుకనే దాని రాజకీయాలు ఎప్పుడూ విధ్వంసపూరితంగానే ఉంటాయి తప్ప మామూలుగా ఉండవు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజలు తిరగబడాలని జగన్ పిలుపునివ్వడంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ఇదివరకు ఒకసారి ప్రజలు తిరగబడితే 11 సీట్లు వచ్చాయి. వైసీపీ ఇలాగే ప్రవర్తిస్తుంటే ప్రజలు తప్పకుండా మరోసారి తిరగబడతారు. అప్పుడు ఆ 11 సీట్లు కూడా పోవచ్చు,” అని అన్నారు.
“హిట్ అండ్ రన్’లా తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడి బెంగళూరు పారిపోయే జగన్మోహన్ రెడ్డికి, ఈ ఎన్నికల ప్రక్రియలో వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారనే విషయం తెలుసుకుంటే మంచిది,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Mumbai Indians have appointed Kieron Pollard as their new head coach ahead of IPL 2027.…
Prabhas’ birthday glimpse of Fauzi has triggered heavy trolling on social media. Instead of creating…