
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్, ఏఐజీ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలియజేయడంతో శాసనసభ సమావేశానికి బయలుదేరబోతున్న మంత్రి నారా లోకేష్ హుటాహుటిన గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం చంద్రబాబు నాయుడు కూడా మరికొద్ది సేపటిలో హైదరాబాద్ చేరుకోబోతున్నారు.
నారా రామ్మూర్తి నాయుడు 1994-99వరకు టిడిపి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, రామ్మోర్తి నాయుడు ఇద్దరి మద్య చక్కటి అనుబందం ఉంది.
ఇద్దరూ కలిసినప్పుడు రాజకీయాల గురించి చర్చించుకుంటారు కూడా. కానీ రామ్మోర్తి నాయుడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
ఆయన కుమారుడు నారా రోహిత్ రాజకీయాలలోకి వస్తారనుకుంటే, ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి నటుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ ఆస్పత్రిలో తండ్రి వద్దనే ఉన్నారు.
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…