Telugu

బాబు: పవన్ ట్రస్ట్ వర్తీ లీడర్…

నేడు విశాఖ వేదికగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిన చేసిన కామెంట్స్ చాల ఆసక్తిగా మారాయి. ఎన్డీయే అలియన్స్ లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయని,

అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఏర్పడి మూడున్నరేళ్లు గడిచిన ఇప్పటికే అదే ట్రస్ట్ తో కూటమి పార్టీలు ముందుకెళుతున్నాయని, అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోస్ట్ ట్రస్ట్ వర్తీ లీడర్ అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించారు.

ADVERTISEMENT

అయితే పవన్ – అన్న విడాకుల వార్త బయటకొచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో అనేక పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి, పవన్ వ్యక్తిగత జీవితం పై ట్రోలింగ్ కూడా గట్టిగానే నడుస్తుంది. పవన్ మూడు పెళ్లిళ్లు, మూడు విడాకుల నేపథ్యంలో ఆయన భాగస్వామికి ఆయన ఎప్పుడు ‘నమ్మదగిన’ భర్తగా ఉండలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు ఎదురవుతున్నాయి.

అయితే దానికి పూర్తి భిన్నంగా నేడు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను మోస్ట్ ట్రస్ట్ వర్తీ అంటూ సంభోదించడం ద్వారా పవన్ పై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు బాబు తన రాజకీయ ప్రశంసలతో చెక్ పెట్టారా.? అంటూ బాబు వ్యాఖ్యలకు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కేవలం రాజకీయాలలో మూడు పార్టీల మధ్యే పవన్ ఇంత ట్రస్ట్ వర్తీ గా ఉంటే ఇక తన వ్యక్తిగత జీవితంలో ఇంకెంత నమ్మదగిన వ్యక్తిగా ఉంటారో.? అంటూ పవన్ కు మద్దతుగా ఆయన అభిమానులు తమ గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే భార్యభర్తల మధ్య జరిగే కొన్ని సంఘటనలు అవి ఆ ఇద్దరు వ్యక్తులకు, నాలుగు గోడలే పరిమితం అని, వాటి ప్రభావం పవన్ రాజకీయ జీవితం మీద పడకూడనేది పవన్ అభిమానుల వాదన. అలాగే పవన్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క మహిళ కూడా తమకుగా అన్యాయం జరిగిందని, పవన్ తమను మోసం చేసారని కానీ ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు.

అంటే ఆ మూడు నిర్ణయాలు కూడా వారిద్దరి పూర్తి అంగీకారంతో తీసుకున్న నిర్ణయాలుగానే పరిగణించాలని జనసైనికులు కోరుతున్నారు. ఏదిఏమైనప్పటికీ నేడు బాబు చేసిన మొత్తం ప్రసంగంలో పవన్ ట్రస్ట్ వర్తీ అన్నఈ ఒక్క మాట జనసైనికులకు ముఖ్యంగా పవన్ అభిమానులకు ఇటువంటి కష్టకాలంలో కొండంత అండగా నిలబడిందనే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పిఆర్పీ – టిఆర్ఎస్: పాత జ్ఞాపకాలు vs కొత్త అనుభవాలు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 'పీఆర్పీ' పేరుకి ఒక చరిత్ర ఉంది, అలాగే ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో…

1 minute ago

PBKS Got A Jackpot Deal? Long Term Plans Revealed

Punjab Kings have made a big move ahead of IPL 2027 by trading Hardik Pandya…

7 minutes ago