Telugu

పిఆర్పీ – టిఆర్ఎస్: పాత జ్ఞాపకాలు vs కొత్త అనుభవాలు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ‘పీఆర్పీ’ పేరుకి ఒక చరిత్ర ఉంది, అలాగే ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని జ్ఞాపకాలను ఉన్నాయి. అలాగే ఇటు టిఆర్ఎస్ విషయంలో కూడా అదే పరిస్థితి.

అయితే పీఆర్పీ కాంగ్రెస్ తో విలీనంతో రాష్ట్ర విభజనకు ముందే ముగిసిన అధ్యాయంగా మారిపోగా, టిఆర్ఎస్ మాత్రం రాష్ట్ర విభజనతో తెలంగాణ రాజకీయ చరిత్రలో తన పేరు మీద ఒక నూతన అధ్యాయాన్ని లిఖించుకోగలిగింది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ అలియాస్ పీఆర్పీ పేరుతో, తెలంగాణలో కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ అలియాస్ ‘టిఆర్ఎస్’ పేరుతో కొత్త రాజకీయ పార్టీలను ప్రారంభించారు. దీనితో నాటి మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ అలియాస్ ‘పీఆర్పీ’, కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అలియాస్ ‘టిఆర్ఎస్’ పార్టీల పాత జ్ఞాపకాలను తెరమీదకు తెచ్చాయి.

నాటి చిరు పీఆర్పీ రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ పార్టీగా అపవాదాలు, నిందలు ఎదుర్కోగా, కేసీఆర్ టిఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న సక్సెస్ ఫుల్ పార్టీగా ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంది. అయితే నాటి పాత జ్ఞాపకాలతో నేడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వేదికల మీదకొచ్చిన ఈ కొత్త పార్టీలు రాజకీయంగా ప్రజల మద్దతు పొందగలవా.?

నేటి సాయిరెడ్డి పీఆర్పీ నాటి చిరు పీఆర్పీ పాత, చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి ఏపీ రాజకీయాల్లో తన పేరు మీద కొత్త అనుభవాలను సృష్టించగలదా.? కవిత టిఆర్ఎస్ తన తండ్రి కేసీఆర్ టిఆర్ఎస్ మాదిరే అనుకున్న లక్ష్యాలను అందుకుని తెలంగాణ రాజకీయాల్లో నాటి పాత జ్ఞాపకాలతో పాటు తన కొత్త అనుభవాలను జోడించగలదా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

PBKS Got A Jackpot Deal? Long Term Plans Revealed

Punjab Kings have made a big move ahead of IPL 2027 by trading Hardik Pandya…

9 minutes ago

బాబు: పవన్ ట్రస్ట్ వర్తీ లీడర్…

నేడు విశాఖ వేదికగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

17 minutes ago