
సిఎం చంద్రబాబు నాయుడు 1998లో అంటే సుమారు మూడు దశాబ్దాల క్రితమే భవిష్యత్‌ని ఐటి రంగం శాశిస్తుందని గ్రహించి హైదరాబాద్ హైటెక్ సిటీ ఏర్పాటు చేశారు. బిల్‌గేట్స్ వంటి దిగ్గజాలను కలిసి హైదరాబాద్‌కి ఐటి కంపెనీలు తీసుకు వచ్చారు.
వాటిని ఏర్పాటు చేయడంతో తన పని అయిపోయిందని వదిలేయలేదు. వాటిలో ఉద్యోగాలకు తగిన అర్హతలు, నైపుణ్యం అవసరం కనుక ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు చేయించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి అత్యున్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.
నాడు చంద్రబాబు నాయుడు దూరదృష్టిని అర్థం చేసుకొని ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న విద్యార్ధులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా, ఐటి నిపుణులుగా, ఐటి కంపెనీల సీఈవోలు అత్యున్నత స్థాయికి ఎదిగారు. దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.
నాడు చంద్రబాబు నాయుడు వయసు 45-47 ఏళ్ళు. కనుక టెక్నాలజీ, దాని ప్రయోజనాల గురించి అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చారు.
ఇప్పుడు అయన వయసు 75 సం.లు కానీ అది ఆయన దృష్టిలో ఓ సంఖ్య మాత్రమే. అందుకే ఈ వయసులో కూడా అయన అదే స్పూర్తితో ఇప్పుడు భవిష్యత్ ‘క్వాంటం కంప్యూటింగ్’దేనని గుర్తించి నేడు అమరావతిలో దేశంలోనే మొట్ట మొదటి క్వాంటం వ్యాలీకి భూమిపూజ చేస్తున్నారు.
కనుక నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఐటి కంపెనీల ఏర్పాటు గురించి ఇప్పుడు ఏవిధంగా చెప్పుకుంటున్నామో ఇదేవిధంగా మరో 30 ఏళ్ళ తర్వాత “ఆనాడే సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేశారని” చెప్పుకోవడం కూడా ఖాయమే.
దేశంలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలా పలు నగరాలు ఐటి కంపెనీలకు రాజధానులుగా ఉన్నాయి. కానీ ఈ ఒక్క క్వాంటం వ్యాలీ ఏర్పాటుతోనే అమరావతి దేశ ఐటి రాజధానిగా మారబోతోంది. మరో రెండు మూడేళ్ళలోనే ఇది నిరూపితమవుతుంది కూడా.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…