
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లారు. పవన్ దంపతులు సీఎం కు ఆత్మీయ స్వాగతం పలికారు.
అయితే ఇటీవల సైనస్ సమస్యతో ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునేందుకు బాబు స్వయంగా పవన్ ఇంటిని సందర్శించి ఆయనను పరామర్శించారు.
అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శల మాదిరి బాబు పరామర్శలలో జై జై బాబు అనే నినాదాలు లేవు, ఎక్కడ వైసీపీ శ్రేణుల మాదిరి టీడీపీ క్యాడర్ రప్ప రప్ప అంటూ పోస్టర్లు ప్రదర్శించలేదు, సీఎం సీఎం అనే అరుపులు కేకలు కనిపించలేదు.
మీడియా హడావుడి, ప్రచార ఆర్భాటాలు అన్నంటికీ దూరంగా అటు బాబు ఇటు పవన్ ఇద్దరు కూడా కేవలం వచ్చిన పనికి మాత్రమే పరిమితమయ్యారు. తనను కలిసేందుకు, తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు తన నివాసానికి వచ్చిన బాబు కి కృతజ్ఞతలు తెలియ చేస్తూ పవన్,
వచ్చింది పరామర్శకు, బల ప్రదర్శనకు కాదు, పార్టీ ప్రచార కార్యక్రమానికి అసలే కాదు అనేలా బాబు సైతం పవన్ ఆరోగ్యం పై వాకపు చేసి విశ్రాంతి కి సూచనలు చేసి తన కార్యక్రమాన్ని సైలెంట్ గా ముగించేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వీరి ఇద్దరి ఫొటోస్ వచ్చే వరకు కూడా ఈ పరామర్శ కార్యక్రమం బయటకు రాలేదు.
కానీ వైసీపీ అధినేత వైస్ జగన్ బయటకొచ్చారు అంటే చాలు రోడ్ల మీద వైసీపీ క్యాడర్ చేసే రచ్చ, వైసీపీ నాయకులు చేసే హంగామా, ఇక ఐప్యాక్ టీం చేసే రాజకీయం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఒక్క పరామర్శలోనే వైసీపీ కి టీడీపీ ఈ స్థాయి తేడా స్పష్టంగా కనిపించడంతో జగన్ పరామర్శల షో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…