Telugu

కవిత కు స్పష్టత ఉంది..మరి కేసీఆర్, కేటీఆర్.?

తెరాస పార్టీతో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్ లకు ఊహించని షాక్ ఇచ్చిన కవిత తానూ ఎంచుకున్న కొత్త దారి పట్ల, అందుకు వేస్తున్న రాజకీయ ఎత్తుగడల పట్ల పూర్తి స్పష్టతతో వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 25 న కవిత కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా చేసిన ప్రసంగంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి కవిత చాల పరుష పదజాలంను వినియోగించారు. అయితే కేసీఆర్ పై కవిత చేసిన విమర్శల గురించి ప్రశ్నిస్తూ తండ్రి ని ఈ స్థాయిలో విమర్శించడానికి మీకు మీ తండ్రికి మధ్య ఆ స్థాయి అగాధం ఎందుకు వచ్చింది.?

ADVERTISEMENT

అలా రావడానికి పొలిటికల్ కారణాల.? లేక వ్యక్తిగత కారణాల అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా అందుకు కవిత ఇచ్చిన సమాధానం కవితకు ఉన్న రాజకీయ స్పష్టతను తెలియచేసింది. నేను ఆ రోజు విమర్శించింది నా తండ్రి కేసీఆర్ ని కాదు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని.

తనకు తన తండ్రి కేసీఆర్ తో ఎటువంటి ఇబ్బంది లేదని కానీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నమాట వాస్తవం అంటూ కుండబద్దలు కొట్టారు. అందుకోసం నేను నిన్న కేసీఆర్ ని విమర్శించా, అవసరమైతే రేపు కూడా విమర్శిస్తా అంటూ చాల స్పష్టమైన సమాధానం ఇచ్చారు. కవిత ఇచ్చిన సమాధానం తో ఒకరకంగా బిఆర్ఎస్ శ్రేణులకు కూడా కనువిప్పు కలిగే అవకాశం ఉంది.

ఇన్నాళ్ళుగా కవిత బిఆర్ఎస్ పై ఆ పార్టీ నేతల పై చివరికి పార్టీ అధిష్టానం పై కూడా విమర్శలు సాగించినా అందుకు కౌంటర్ ఇచ్చేందుకు బిఆర్ఎస్ ముందుకు రాలేకపోతుంది. అటు పార్టీ అధినేతగా కేసీఆర్ కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కానీ కవిత ఆరోపణలకు మౌనమే తమ సమాధానం అన్నట్టుగా కవిత పట్ల మీడియా అడిగే ప్రశ్నలను దాటవేస్తూ వెళ్తున్నారు.

ఇటువంటు తరుణంలో కవిత తానూ విమర్శిస్తోంది తన తండ్రిని కేసీఆర్ ని కాదని తన ప్రత్యర్థి పార్టీ అధినేత కేసీఆర్ ని మత్రమే అంటూ స్పష్టత ఇవ్వడంతో, ఇక బిఆర్ఎస్ శ్రేణులు కూడా తాము ఎదురుదాడి చేస్తుంది కేసీఆర్ కుమార్తె కవిత పై కాదు తెరాస పార్టీ అధినేత కవిత పై అంటూ కవిత మీద కవిత తెరాస మీద ఎదురుదాడి చెయ్యవచ్చు.

కానీ అందుకు బిఆర్ఎస్ సాహసిస్తుందా అంటే సందేహమే. అసలు కవిత కూడా తన పై బిఆర్ఎస్ ఎదురుదాడి చెయ్యడం కోసమే ఎదురుచూస్తున్నారు. అటువంటు అవకాశాన్ని కవితే బిఆర్ఎస్ కు అందించినా బిఆర్ఎస్ మాత్రం ఇంకా ముందడుగు వెయ్యలేకపోతుంది.

కవిత దూకుడు రాజకీయాలతో తెరాస ముందుకు రాలేకపోయినా బిఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వెయ్యాల్సిందే అనేలా కవిత తన రాజకీయ ప్రయాణాన్ని చాల స్పష్టతతో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి కేటీఆర్, కేసీఆర్ ఇకనైనా తమ మౌన దీక్షకు శుభం కార్డు వేస్తారా లేదా.? అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Peddi, Paradise, Bhogi: Mass Formula Tiring Out Audiences

“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…

31 minutes ago

Big Case Against EC Chief: What Is The SC Verdict?

Election commission chief Gyanesh Kumar had been facing a peculiar challenge as the people of…

1 hour ago