
సమర్ధంగా రాజకీయాలు చేసినవారు అంతే సమర్ధంగా రాష్ట్రాన్ని పాలించగలరని అనుకోలేము. ఇందుకు జగన్ చేస్తున్న రాజకీయాలు, ఆయన 5 ఏళ్ళ విధ్వంస పాలన చక్కటి ఉదాహరణ.
సరే! పాలన, అభివృద్ధి చేతకాకపోతే పాయె కనీసం చిన్న చిన్న పనులైన సమర్ధంగా చేయించగలిగారా అంటే అదీ లేదు.
ఉదాహరణకు విశాఖలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రమైన ఆర్‌కే బీచ్‌లో సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేసి సముద్రపు అలలపై తేలియాడే చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించారు.
అది తీరం నుండి సుమారు ఓ 100-200 అడుగులు సముద్రంలో నీళ్ళపై తేలియాడుతూ ఉంటుంది. ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నేటికీ కేరళలో ఉంది. కానీ అక్కడ సముద్రంలో పెద్దగా అలలు ఉండవు కనుక నేటికీ పర్యాటక ఆకర్షణగా నిలిచి ఉంది.
కానీ విశాఖ ఆర్‌కే బీచ్‌లో చాలా ఉదృతంగా అలలు వస్తాయి. కనుక “ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఎవరూ సముద్రంలోకి దిగవద్దు…” అంటూ అక్కడే ఓ హెచ్చరిక బోర్డు కూడా ఉంది. కానీ ఇంత చిన్న విషయం పట్టించుకోకుండా ఆర్‌కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించారు. కానీ అలల తాకిడికి మొదటి రెండు రోజులలోనే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది!
ఇది జగన్ మార్క్ ఆలోచన కాగా సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
విశాఖ ఆర్‌కే బీచ్ తీరం భీమిలి వరకు వ్యాపించి ఉంది. దారి పొడవునా సముద్ర తీరం వెంబడి చక్కటి రోడ్ ఉంది. దారి పొడవునా అనేక బీచ్ పార్కులు, వ్యూ పాయింట్స్, మంచి హోటల్స్ వగైరా ఉన్నాయి. కనుక పర్యాటకులు వాటన్నిటినీ సందర్శించడానికి వీలుగా సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రెండు డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించారు. వాటికి మంచి ఆదరణ లభిస్తే మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విశాఖ ప్రజలతో పాటు ఇతర జిల్లాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ డబుల్ డక్కర్ బస్సులలో బీచ్ పార్కులు చూసేందుకు అప్పుడే క్యూ కడుతున్నారు.
జగన్ రూ. 4 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రోజు తొలి రోజే సముద్రంలో కొట్టుకుపోగా, చంద్రబాబు నాయుడు రూ. 4 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సుల ప్రయోగం తొలిరోజే విజయవంతం అయ్యిందన్న మాట.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…