కుల పెద్దలన్నారు.. జెండా కూలీలుగా మిగిలారా.?

2024 ఎన్నికలు ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఎన్నో సువిశాలమైన మార్పులకు శ్రీకారం చుట్టాయి. అపజయాలే తప్ప విజయం ఎరుగని పవన్ కళ్యాణ్ 151 సీట్లతో అందనంత ఎత్తున కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి ని పాతాళానికి తొక్కుతా అంటూ భీష్మ ప్రతిజ్ఞ పూనాడు.

ADVERTISEMENT

అలాగే ఈసారి జరగబోయే ఎన్నికలలో ఏపీ రాజకీయ పోరు నుండి జనసేన పార్టీని సమూలంగా తుడిచి పెట్టి ఆ పార్టీ అధినేత పవన్ రాజకీయ జీవితానికి సమాధి కట్టి తీరుతా అంటూ వ్యూహాలతో జగన్ హోరాహోరీ పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఈ పోరులో పవన్ టీడీపీ, బీజేపీ లతో కూటమి కట్టి వైసీపీ పతనానికి పునాది వేశారు.

అయితే జగన్ మాత్రం పవన్ సామజిక వర్గం పెద్దలతోనే ఆయనకు చెక్ పెట్టడానికి కాపు కుల పెద్దలుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి సీనియర్ కుల నాయకులను రాజకీయ తెర మీదకు తెచ్చారు. అయితే ఇందులో ఒకరిని పవన్ కు శ్రేయోభిలాషిగా పరిచయం చేస్తే మరొకరిని పవన్ కు శత్రువు గా ఆవిష్కరించారు.

పవన్ తో వైసీపీ కండువా కప్పుకుని ముద్రగడ ప్రత్యక్ష పోరాటానికి దిగితే, హరిరామ జోగయ్య పవన్ కు సన్నిహితుడిగా ఉంటూ జనసేన పతనానికి వైసీపీకి పరోక్ష సాయం అందించారు. టీడీపీ, బీజేపీ లతో కూటమి కట్టిన జనసేనను ఉద్దేశించి కాపు కులానికి ముఖ్యమంత్రి హోదా దక్కి తీరాల్సిందే అంటూ పవన్ సామజిక వర్గాన్ని రెచ్చకొట్టి కూటమి విచ్ఛిన్నానికి జోగయ్య ఉత్తరాల రాయబారం మొదలుపెట్టారు.

ఇక ముద్రగడ మరో అడుగు ముందుకేసి పవన్ పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ను ఓడించి తీరుతా, లేకుంటే నా పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటా అంటూ శపధాలు చేసి సొంత కూతురు చేత అవమానించబడ్డారు. అయితే జోగయ్య గారి ప్రేమ లేఖలు కానీ, ముద్రగడ గారి శపధాలు కానీ జనసేనాని గెలుపుని అడ్డుకోలేయకపోయాయి.

దీనితో వైసీపీ ఓటమి, వీరి పతనం ఏకకాలంలో జరిగిపోయింది. అయితే వైసీపీ ఓటమి తరువాత జగన్ ఈ కుల పెద్దలను కనీస మర్యాదకు కూడా కలవలేదు సరికదా వారి పై కూటమి మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు వైసీపీ పార్టీ నుండి కనీస మద్దతు కూడా కల్పించలేదు.

ఈ నేపథ్యంలో కుల పెద్దలుగా చెప్పుకున్న ఈ ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి ఇద్దరు నాయకులు జగన్ పల్లకి మోసే జెండా కూలీలుగా మిగిలిపోయారా అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ పెద్దమనుషుల మీద సమాజంలో చాలా చిన్న చూపు మొదలయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Big Breaking: Jantar Mantar No Longer For Protests!

For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…

19 minutes ago

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

48 minutes ago