Telugu

రాజుల ఆధ్వర్యంలోనే కుప్పకూలుతున్న రాజ్యాలు..!

ఒక 2 -3 ఏళ్ళు ముందుకు వెళ్లి ఐపీఎల్ ను డామినేట్ చేసిన జట్లు ఏవి అని అడగగా, సామాన్య అభిమానుల నుండి వచ్చే ఖచ్చితమైన సమాధానం…’ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్’. ముంబై జట్టు గత ఐదేళ్లుగా కాస్త తడపడుతున్నప్పటికీ, చెన్నై మాత్రం ప్రతి సీజన్ లోను అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

ఈ సారి ఐపీఎల్ ప్రారంభానికి మునుపు, ఈ రెండు జట్ల అభిమానులు కప్ తమదే అంటూ సోషల్ మీడియా లో తెగ హడావుడి చేసారు. అలాగే ఇరు జట్లు కూడా ఆ ధీమా తోనే ఐపీఎల్ ను మొదలుపెట్టారు. కానీ, ఏ ముహూర్తాన ఈ ఐపీఎల్ మొదలయిందో గాని, ముంబై మరియు చెన్నై పాయింట్ల పట్టిక లో చివరి స్థానాలకే పరిమితమయ్యారు.

ADVERTISEMENT

ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ కెప్టెన్ గా ఉన్న కాలం లో చెన్నై జట్టుతో కలుపుకుని, ఐపీఎల్ అనే లీగ్ లో ప్రతి జట్టును డామినేట్ చేసేవారు. తమ హోమ్ గ్రౌండ్ అయిన వానఖేడే ను తమ సామ్రాజ్యం గా చేసుకుని, 7 ఏళ్ళ వ్యవధిలో 5 కప్పులను అందుకుని, బెస్ట్ ఫ్రాంచైజ్ గా నిలిచింది ముంబై ఇండియన్స్.

ఇక, మరోపక్క ఐపీఎల్ మొదలయిన రోజు నుండే ఎం.ఎస్.ధోని సారధి గా ఉన్న సి.ఎస్.కె జట్టు ఐపీఎల్ కే బాస్ లా పెర్ఫామ్ చేసేవారు. ముఖ్యంగా, చెన్నై లో ని చెపాక్ గ్రౌండ్ ను తమ కంచుకోట లా మార్చుకుని, వయసు పై బడిన ఆటగాళ్లను, లేదా యువరక్తాన్ని జట్టులోకి తీసుకుని, వారిని తమకు కావాల్సిన విధంగా మలుచుకుని, ఈ జట్టు కూడా 5 కప్పులను అందుకున్నారు.

ఒకప్పుడు అలవోకగా కప్పులు గెలిచిన ఈ రెండు జట్లు నేటి రోజున మ్యాచ్ గెలిచేందుకు అష్ట-కష్టాలు పడుతున్నారు. ఒకప్పుడు తమతో మ్యాచ్ ఉందంటే, ప్రత్యర్థి జట్టు తమ జట్టుకి విజయం వారించాలి అంటూ అభిమానులు పూజలు చేసే రోజుల నుండి ఇప్పుడు మ్యాచ్ రోజు తమ జట్టు గెలవాలని సొంత అభిమానులే పూజలు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.

ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్ లో CSK ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం ముంబై తో ఆడిన ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన ఐదు మ్యాచ్ లను చెన్నై జట్టు చేజార్చుకుంది. అలాగే ఇటు ముంబై కూడా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో కోల్కోత్త జట్టు పై మాత్రమే విజయ కేతనం ఎగరేసి మిగిలిన నాలుగు మ్యాచ్ లలోను ఓటమి అనే నిరాశతోనే వెనుతిరిగింది.

దీనితో ఇప్పటి వరకు వారి స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ గెలుపు సామ్రాజ్యాన్ని వారి కళ్ళ ఎదుటే, వారి ఆధ్వర్యంలోనే కూలిపోతుందా అంటూ ఇరు జట్ల అభిమానులు ధోని, రోహిత్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bowling Like His Prime Days: Still Out! Selection Bias

Mohammed Shami is still hoping for another chance to play for Team India, and his…

9 minutes ago

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

16 minutes ago