
వైసీపీలో సీనియర్, జగన్‌కు అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్న ఆయన, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోవచ్చునని భావించిన ఏపీ పోలీసులు లుకవుట్ నోటీస్ జారీ చేశారు.
ఈరోజు ఆయన బెంగళూరు విమానాశ్రయం రాబోతున్నారనే విషయం విమానాశ్రయ అధికారులు ఏపీ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడలో సిట్ కార్యాలయానికి తీసుకువస్తున్నారు.
మద్యం కుంభకోణం విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కూటమిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అందరూ మౌనంగా, దూరంగా ఉంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎప్పటిలాగే వెంటనే స్పందిస్తూ, “చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు ప్రభుత్వం, పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ” వైసీపీ సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలుపెట్టేసింది.
అయితే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (ఏ-2) సూత్రధారి అని నిరూపించే అనేక సాక్ష్యాధారాలు చూపిస్తున్నా, అక్రమంగా ఈ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్నప్పుడు, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు పోలీసులు వచ్చేస్తే ఖండించకుండా ఉండరు కదా?మద్యం కుంభకోణం కేసులో ఒకరొకరు అరెస్ట్ అవుతుంటే, అది జగన్ వైపు పడుతున్న అడుగులే అని ఆందోళన చెందకుండా ఉంటారా? అన్యాయం అక్రమం అని వాదించకుండా ఉంటారా?
The month of September in the ongoing year turned out to be unlucky for a…
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…