
China tests CE-25A electric aircraft
సాంకేతిక సమస్యల కారణంగా ఓ పక్క అమెరికాలో వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోతుంటే.. మరోపక్క చైనా మొట్ట మొదటి పైలట్ రహిత, విద్యుత్ (చార్జింగ్) విమానం సీఈ-25ఏని శనివారం విజయవంతంగా పరీక్షించింది.
దీనిని ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నందున, అత్యవసరమైతే విమానాన్ని నియంత్రించేందుకు ఇద్దరు పైలట్స్, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ కాక్‌పిట్‌లో ఉన్నారు. వారి పర్యవేక్షణలో ఈ విమానం టేకాఫ్ చేసి కొంతసేపు గాల్లో ప్రయాణించి మళ్ళీ దానంతట అదే సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఈ విమానాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించేలా రూపొందించారు. దీనిలో 19 మంది ప్రయాణించడానికి వీలుగా ఈ విమానాన్ని రూపొందించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఇది గాల్లో ప్రయాణించింది. మళ్ళీ నిన్న అంటే నవంబర్ 14న మరో పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
అయితే ఈ విమానానికి మరిన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయితే విమానయాన రంగంలో చైనా తొలి విద్యుత్ విమానాల ఉత్పత్తి మొదలుపెట్టి అందుబాటులోకి తెస్తుంది.
King Nagarjuna presented Aniesh's Itllu Arjuna and he is proving to be a potential star…
నాయుడుగారూ.. అమెరికా విమాన సంక్షోభం చూస్తున్నారా? ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో…