
ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన చిన్ని కృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి 150వ సినిమాపై స్పందిస్తూ… అది కేవలం తమిళ హిట్ కు ఒక జిరాక్స్ కాపీగా అభివర్ణించారు. ఈ సినిమా కోసం ఒక కధను వినిపించినప్పటికీ చిరు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో చిన్ని కృష్ణకు చేదు అనుభవమే ఎదురయ్యింది. అలాగే గతంలో రామ్ చరణ్ ఎంట్రీ కోసం కూడా ఒక కధను సిద్ధం చేయగా, అప్పటికి ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పూరీ జగన్నాధ్ వైపుకు చిరు మళ్ళారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
సంక్రాంతికి రాబోయే మెగాస్టార్ 150వ సినిమా, నందమూరి నటసింహం 100వ సినిమాల మధ్య పోటీ గురించి పెద్దగా స్పందించని చిన్ని, తన ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించడం లేదని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఒకటి, రెండు సందర్భాలలో కూడా చిన్ని కృష్ణ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవికి ‘ఇంద్ర,’ బాలకృష్ణకు ‘నరసింహనాయుడు’ వంటి ఆల్ టైం రికార్డులు సృష్టించిన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చిన్ని, చివరగా అల్లు అర్జున్ కు ‘బద్రినాద్’ కధను అందించి మెగా అభిమానులను నిరాశపరిచారు.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…