మెగా ఇంట వేడుక… ఫ్యాన్స్ కు కన్నుల పండుగ..!

chiranjeeve daughter sreeja Pellikuthuru celebrationsమెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ వివాహ ఘడియలు దగ్గరికి వస్తుండడంతో ఆహ్వాన పత్రికల పంపిణీలో కుటుంబ సభ్యులు మునిగి తేలుతున్నారు. తాజాగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును కలిసిన అల్లు అరవింద్ హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కు ఆహ్వానం పలికారు. అలాగే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు మెగా అభిమానులకు కన్నుల పండుగగా ఉన్నాయి.

శ్రీజను ముస్తాబు చేసి సోదరుడు వరుణ్ తేజ్, సోదరిమణులు సుష్మ, నిహారికలతో పాటు బావలు అల్లు అర్జున్, శిరీష్ లతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అంగరంగ వైభవంగా ఈ ఆదివారం నాడు జరగనున్న ఈ వేడుక అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

ADVERTISEMENT

అయితే ఎంత మంది ఉన్నా… పవర్ స్టార్ లేని లోటు ఫ్యాన్స్ లో కనపడుతోంది. ‘సర్ధార్’ పాటల చిత్రీకరణలో విదేశాల్లో ఉన్న పవన్ రాకపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అయితే వివాహానికి గానీ, రిసెప్షన్ కు గానీ ఏదొక వేడుకలో పవన్ కనువిందు చేస్తారని మాత్రం సినీ వర్గీయులు చెప్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories