వీళ్ళ వల్ల కాదు గానీ… స్వయంగా చిరంజీవే రంగంలోకి…!

chiranjeevi 150th movieబాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్న మెగా హీరోలు వరుసగా బోల్తా కొడుతున్నారు. ‘బ్రూస్ లీ’తో మొదలైన ఈ వెల్లువ తాజాగా భిన్న స్పందనలు వచ్చిన ‘సరైనోడు’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… అంతకుముందు మెగా హీరోల సినిమాలంటే మినిమమ్ గ్యారెంటీ అన్న నానుడి ఉండేది. కానీ, ప్రస్తుత మెగా హీరోల సినిమాలన్నీ ‘డిజాస్టర్’లుగా మారడం అభిమానులను కలచి వేసే అంశం.

ADVERTISEMENT

బహుశా ఈ రాత మార్చాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారో లేక తన 150వ సినిమాను అధికారికంగా ప్రకటించి, నిరుత్సాహంలో ఉన్న మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావించారో గానీ, మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ నెల 29వ తేదీన జూబ్లిహిల్స్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 నిముషాలకు 150వ సినిమా అధికారికంగా ప్రారంభం కాబోతోంది.

వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా “కత్తి” రీమేక్ అని గతంలో రామ్ చరణ్ ప్రకటించగా, ఇటీవల కాలంలో మాత్రం ఫ్రెష్ స్క్రిప్ట్ తో రాబోతున్నారన్న వార్తలు హల్చల్ చేసాయి. దీంతో ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మరి మెగా ‘డిజాస్టర్ల’కు చిరంజీవి బ్రేక్ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడతారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories