
అనేక వాయిదాల నడుమ ఎట్టకేలకు ఈ నెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైన “ఆచార్య” సినిమా హైప్ కు ప్రమోషన్స్ చాలా కీలకం. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు మరియు టీజర్ విడుదలయ్యాయి. మిగిలి ఉన్న ప్రమోషన్స్ లో ఇంకా రెండు పాటలు మరియు ధియేటిరికల్ ట్రైలర్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
అయితే అతి త్వరలోనే ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచే విధంగా ఓ పాటను చిత్ర యూనిట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి డ్యాన్స్ వేసిన పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. ఈ పాట గురించి దర్శకుడు కొరటాల శివ గతంలో చాలా చెప్పుకొచ్చారు.
దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపు చేసే పాటగా “ఆచార్య” ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. టీజర్ లో ఒకే షాట్ లో రామ్ చరణ్ – చిరులను చూసి పండగ చేసుకున్న ఫ్యాన్స్ కు, ఈ డ్యాన్సింగ్ నెంబర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఉంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదలైన 3 పాటల్లో 2 సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇక ఇటీవల “ఆర్ఆర్ఆర్”తో రామ్ చరణ్ కు ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. ఇది కూడా “ఆచార్య” మెటీరియల్ కు దోహదం కానుంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా రామ్ చరణ్ అన్ని వర్గాలకు చేరువ అయ్యారు. అయితే వెనువెంటనే మరో క్యారెక్టర్ ద్వారా రామ్ చరణ్ ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న భయం కూడా లేకపోలేదు.
త్వరలో రిలీజ్ కాబోతున్న డ్యాన్సింగ్ నెంబర్ ను మినహాయిస్తే, ధియేటిరికల్ ట్రైలర్ ఒక్కటే మిగిలి ఉంటుంది. ఇది సినిమా రిలీజ్ కు ఒక పది రోజులు ముందు విడుదల అవుతుంది గనుక, ప్రస్తుతం అభిమానుల కళ్లన్నీ చిరు – చరణ్ లు కలిసి డ్యాన్స్ చేసిన పాట వైపే!
Andhra Pradesh has just hit a major milestone, securing 2nd place in the National Panchayat…
Following the pan-India success of Kalki 2898 AD, Prabhas is now preparing for the much-awaited…