కరోనా యావత్తు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. అసలు సినిమాకు భవిష్యత్తు ఉందా? ఇంతకు ముందులా ప్రేక్షకుల థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో చాలా సినిమాలు కరోనా కు ముందు అనుకున్న రేట్ల కంటే తక్కువకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది.
దీనితో పెద్ద సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వేచి చూసే ధోరణి లో పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కు వాయిదా వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజమౌళి పరిస్థితి ఇంకోటి. ఆర్ఆర్ఆర్ సుమారుగా 500 కోట్ల బడ్జెట్ సినిమా… అదంతా కరోనా ముందు అంచనా… దాన్నిబట్టి బిజినెస్ జరగకపోతే చాలా నష్టం.
ఆర్ఆర్ఆర్ ని దసరాకు విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించారు. అయితే అప్పటికి ఇండియాలో పరిస్థితి ఎలా ఉన్నా బయట దేశాలలో పరిస్థితి చక్కబడకపోతే వాయిదా తప్పనిసరి. ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు చిరంజీవి రూపంలో కాన్ఫిడెన్స్ దక్కింది. చిరంజీవి ఆచార్య సినిమా నైజాం హక్కులకు 35 కోట్ల ఆఫర్ వచ్చింది.
35 కోట్లు అంటే సంచలనం అది కూడా కరోనా కాలంలో. దీనిబట్టి కరోనా ఎఫెక్ట్ తెలుగు సినిమాల మీద ఉండదని… క్రేజ్ ని బట్టే ఆఫర్లు ఉంటాయని… ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ కు ఏ మాత్రం ఢోకా ఉండదని అర్ధం అవుతుంది. దీనితో ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుందంట. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా షూట్ చెయ్యనున్నారు రాజమౌళి.





