అలా ఇరుపక్షాలు ఇబ్బంది లేకుండా చిరంజీవి తేల్చేశారు

Chiranjeevi clarification on Mahesh babu role in acharya movieమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోని అతిధి పాత్ర గురించి మనం చాలానే విన్నాం. ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే భారీ పారితోషికం డిమాండ్ కారణంగా మేకర్స్ ఆ ప్రతిపాదన విరమించుకున్నారని కూడా విన్నాం. రామ్ చరణ్ ఇప్పుడు ఆ పాత్ర చేస్తున్నాడని సమాచారం.

చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ, “ఇది ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు. మా ఇద్దరికీ అద్భుతమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మేము పాత్ర కోసం మహేష్ ని ఎప్పుడూ సంప్రదించలేదు. అతను కూడా నా కొడుకు లాంటివాడు. కొరటాల మొదటి నుండీ రామ్ చరణ్ ఈ పాత్ర చేస్తే బావుండు అనుకునేవారు ” అని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే చిరంజీవి కవరింగ్ అనే చెప్పుకోవాలి. రెమ్యూనరేషన్ కారణంగా మహేష్ చెయ్యడం లేదు అంటే అటు మహేష్ కు ఇటు ఆచార్య బృందానికి ఇబ్బందే. పైగా మహేష్ ఒక పెద్ద స్టార్. అటువంటి కారణం బయట పెడితే మహేష్ ఫాన్స్ కూడా హర్ట్ అవుతారు. ఈ గొడవ అంతా ఎందుకని అసలు మహేష్ ని సంప్రదించలేదు అని చెప్పేశారు చిరంజీవి.

ఇది ఇలా ఉండగా… రామ్ చరణ్ చేస్తున్నాడట అనే దాని మీద కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు చిరంజీవి. “రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు. రాజమౌళి అతన్ని సినిమా చేయడానికి అనుమతిస్తారో లేదో నాకు తెలియదు. రాజమౌళి, కొరటాల శివ ఒక అవగాహనకు వస్తే, అతను ఆ పాత్ర చేయవచ్చు ”అని చిరంజీవి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories