సిఎంతో డిప్యూటీ సిఎం పవన్ సమావేశం.. సీరియస్ మ్యాటర్?

Pawan Kalyan and Chandrababu discuss polls

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో నేడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. మరోపక్క డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌ లేకుండా ఒంటరిగా సిఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి సుమారు గంట సేపు సమావేశం అయ్యారు.

ఈ రెండు సమావేశాలు కీలకమైనవేనని వేరే చెప్పక్కర లేదు. ముందుగా జగన్‌ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిందని, పార్టీలో అందరూ చాలా ధైర్యంగా పోరాడుతున్నారన్నారు. పార్టీ నేతలకు ఓ ముఖ్య సూచన చేశారు. టీడీపీ దౌర్జన్యాలు ఎదుర్కోలేని పరిస్థితి నెలకొని ఉంటే, వారి దౌర్జన్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి బలమైన సాక్ష్యాధారాలు సేకరించాలని సూచించారు.

ADVERTISEMENT

వైసీపీ చేస్తున్న న్యాయపోరాటాలకు ఈ సాక్ష్యాధారాలు చాలా కీలకంగా నిలుస్తాయని జగన్‌ చెప్పారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వాన్ని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టడం పెద్ద కష్టం కాదు. కనుక ఈ విషయంలో జగన్‌ వైసీపీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసినట్లే చెప్పవచ్చు.

అయితే ఆయన చెప్పకపోయినా వైసీపీ సొంత మీడియా, దాని అనుకూల మీడియా, సోషల్ మీడియా వారియర్స్ ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. కనుక ఈ ఎన్నికలలో వైసీపీ ఓడినా, న్యాయపోరాటంలో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఒంటరిగా సిఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి గంటసేపు సమావేశమవడం యధాలాపంగా భావించలేము. ఈ ఎన్నికలపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు, రెబల్ అభ్యర్థుల గురించి వారు చర్చించారని వార్తలు వస్తున్నప్పటికీ, నామినేషన్స్‌ ప్రక్రియలో జరుగుతున్న ఘర్షణలు, పోలీసుల వైఖరి గురించి చర్చించి ఉండవచ్చు.

డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇదివరకే హోంమంత్రి అనిత వంగలపూడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒకవేళ నేనే హోంమంత్రినైతే పరిస్థితి ఇలా మాత్రం ఉండదని’ పవన్ కళ్యాణ్‌ అప్పుడే అన్నారు.

రాష్ట్రంలో ఇంతగా గొడవలు జరుగుతుంటే, ఆమె స్పందన నామమాత్రంగా ఉంటోంది. కనుక పవన్ కళ్యాణ్‌ నేడు ఆమె విషయం కూడా మళ్ళీ ప్రస్తావించి ఉండవచ్చునే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎటువంటి కొత్త చర్యలు తీసుకోబోతున్నారనేది వారి సమావేశానికి సారాంశంగా చూడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories