వైభవంగా మెగా తనయురాలి వివాహం!

chiranjeevi daughter sreeja second marriage with kalyanమెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం 9:13 నిమిషాలకు బెంగుళూరులోని చిరు ఫామ్ హౌస్ వేదికగా శ్రీజ వివాహం జరిగింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్ తో ముందుగా నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజ‌ర‌యినట్లు స‌మాచారం. విందుకు ప‌లు రంగాల‌కు చెందిన‌ ముఖ్యమైన వారిని ఆహ్వానించి, గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఈ వేడుక‌కు సినీ పరిశ్రమ నుండి ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు, రానాలు హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక సంద‌ర్భంగా చిరంజీవి పాటలకు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఆనందంతో చిందులేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌ రిసెప్షన్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మార్చి 31వ తేదీన ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT
Latest Stories