
ఆ తర్వాత డిసెంబర్ నుండి ఆడియో హంగామాతో మొదలై, సంక్రాంతి వరకు నిర్విరామంగా పబ్లిసిటీ కార్యక్రమాలతో భారీ ఓపెనింగ్స్ లక్ష్యంగా “ఖైదీ” సిద్ధమవుతున్నాడని ట్రేడ్ వర్గాల టాక్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు తగినంత సమయం కేటాయించి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్న నేపధ్యంలోనే, నవంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించుకున్నట్టుగా తెలుస్తోంది.
మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ సినిమా మురుగదాస్ – విజయ్ ల “కత్తి” రీమేక్ అన్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు చిరు వారసుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన దీపావళి స్టిల్స్ అభిమానుల కళ్ళల్లో కొత్త కాంతులను చూడడంలో సక్సెస్ కావడంతో, ‘బాస్ ఈజ్ బ్యాక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…