రాజమౌళి దర్శకత్వం… త్రివిక్రమ్ డైలాగ్స్… చిరు హీరో..!

Chiranjeevi movie under rajamouli directionప్రస్తుతం దేశం మొత్తాన్ని ఊపేస్తున్న పేరు రాజమౌళి. ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి అన్న పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ప్రతి హీరో ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా అభిప్రాయ పడ్డారు. చిరు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానంలో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.

శంకర్, త్రివిక్రమ్, రాజమౌళి… ఈ ముగ్గురిలో ఎవరి దర్శకత్వంలో నటిస్తారు అంటే… శంకర్ అందించిన కధతో, త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ తో, రాజమౌళి డైరెక్షన్ లో చేయాలని ఉందంటూ తప్పించుకునే సమాధానం చెప్పినప్పటికీ, దర్శకత్వంలో రాజమౌళి పేరే చెప్పడంతో అసలు సమాధానం వచ్చేసినట్లే! అలాగే ‘డైలాగ్స్ కింగ్’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కే పట్టాభిషేకం చేసారు. నిజానికి ఈ ముగ్గురు ఒకరిని మించి మరొకరని, సమయం కుదరాలే గానీ, ఈ ముగ్గురితో చేయాలని ఉందన్న అభిలాషను వ్యక్తపరిచారు మెగాస్టార్.

ADVERTISEMENT

ఇక తన తదుపరి సినిమా “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” ఆగష్టులో ప్రారంభమై, వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నామని, ఆల్ ఇండియా స్టార్ నటీనటులతో ఈ సినిమా ఉంటుందని, బడ్జెట్ ఇంత అని కూడా అనుకోలేదని, ఎంత అయితే అంత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ సినిమా కోసం అంతా అత్యున్నత సాంకేతిక నిపుణులనే ఎంపిక చేస్తున్నామని, బడ్జెట్ తదితర సంగతులన్నీ రామ్ చరణే చూసుకుంటాడని స్పష్టం చేసిన చిరు, ఓ రియల్ కధకు సురేందర్ రెడ్డి రాసిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories