2016లో మెగాస్టార్ “ముఠామేస్త్రీ” గెటప్!

Chiranjeevi Mutha Mestri 2016 look మా సినీ అవార్డ్స్ వేడుక మెగా ఫ్యాన్స్ ను అమితమైన ఉత్సాహంలోకి నెట్టింది. తమ అభిమాన హీరో వేసిన స్టెప్పులకు ఫిదా అయిన అభిమాన గణం తాజాగా ‘ముఠామేస్త్రీ’ లుక్ లో కనపడుతున్న మెగాస్టార్ ఫోటోను చూసి పండుగ చేసుకుంటున్నారు.

1991లో విడుదలైన ‘ముఠామేస్త్రీ’ సినిమాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి స్టిల్ కు, 2016లో అదే గెటప్ లో కనపడుతున్న స్టిల్ ను పక్కపక్కనే పెడుతూ… 23 సంవత్సరాల తర్వాత కూడా ఏం తేడా లేదు అంటూ మెగా లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

మరి ఈ ‘ముఠామేస్త్రీ’ లుక్ కొత్త సినిమా ‘కత్తి’ కోసం… అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇటీవల ముగిసిన మా సినీ అవార్డ్స్ రిహార్సల్స్ లో భాగంగా మెగాస్టార్ ఈ ‘ముఠామేస్త్రీ’ గెటప్ వేసుకుని ముచ్చట తీర్చుకున్నారు. మాస్ ప్రేక్షకుల ఇలవేల్పుగా కొనియాడే మెగాస్టార్ ను ఈ లుక్ లో చూసుకోవడం ఫ్యాన్స్ కు కూడా పండగే కదా!

ADVERTISEMENT
Latest Stories