
అయితే అది మెగాస్టార్ చిరంజీవితో కాదు! నారా రోహిత్ తో ‘ప్రతినిధి’ సినిమాకు కధ అందించిన ఆనంద్ రవి తాజాగా రచించుకున్న ఓ కధను, తనే దర్శకత్వం వహిస్తూ “నెపోలియన్” పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘ది మ్యాన్ హు లాస్ట్ హిజ్ షాడో’ అంటూ ఉపశీర్షికతో విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉండగా, మెగా అభిమానులకు మాత్రం ఓ స్పష్టత ఇచ్చినట్లయ్యింది.
టైటిల్ విషయంలో ఎలాంటి రగడ జరగకూడదన్న ఉద్దేశంతోనే, ‘నెపోలియన్’ బృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించినదని హల్చల్ చేయడంతో ఈ ‘నెపోలియన్’ టైటిల్ ఒక్కసారిగా ప్రచారం పొందింది. దీంతో ఇది మరో ‘మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తి’ల మాదిరి కాకుండా, ఒకే ఒక్క ‘నెపోలియన్’ అది కూడా ఓ కామన్ మ్యాన్ ‘నెపోలియన్’ అని స్పష్టం చేసారు.
The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…
Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…