తెర మీదకు చిరంజీవి జీవితం

Chiranjeevi no to biopicకొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తన ఆత్మకథపై పనిచేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నేను చాలా కాలంగా జీవిత చరిత్ర రాయడం గురించి ఆలోచిస్తున్నాను. అది ఇప్పటికి కుదిరింది. సురేఖ (చిరంజీవి భార్య) తో మా జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాను మరియు వాటన్నింటినీ వీడియోగ్రాఫ్ చేస్తున్నాను” అని చిరంజీవి వెల్లడించారు.

తాజాగా వచ్చిన మరో ఇంటర్వ్యూలో తన బయోపిక్ చేయడంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను నా ఆత్మకథపై పని చేస్తున్నాను. ఆ కథనాలతో ఒక డాక్యుమెంటరీని తీసుకురావాలని యోచిస్తున్నాను. బయోపిక్ విషయానికొస్తే, నా జీవితంలో ఆసక్తిని కలిగించేంత మలుపులు ఉన్నాయని నేను అనుకోవడం లేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

చిరంజీవి ప్రస్తుతం కోరటాల శివ దర్శకత్వంలో ఆచార్య కోసం పనిచేస్తున్నారు. ఆచార్యను స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆగస్టు 14 న విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ సంక్రాంతి రేసులో లేనట్లయితే, ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు.

ఆయన తదుపరి చిత్రం, లూసిఫెర్ రీమేక్ ఈ సంవత్సరం చివరిలో సెట్స్ కి వెళ్ళే అవకాశం ఉంది.సాహో దర్శకుడు సుజీత్ దీనికి పని చేస్తారు. ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో యువి క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories