చిరంజీవికి జగన్ భయం?

Uyyalawada's-50-Crore-Police-Case-on-Chiranjeevi-and-Ram-Charanమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. ఈ సినిమాకు 200 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని టీం అంటుంది. ఇంత భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ చాలా కీలకంగా ఉండబోతున్నాయి.

అయితే సినిమాకు సంబంధించి టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న రాజకీయ వైరుధ్యం వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేదా అనే టెన్షన్ చిత్రబృందంలో మొదలయ్యింది.

ADVERTISEMENT

ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రాన్ని రేపు విడుదల అవుతుంది అనగా ఈరోజు సాయంత్రం సినిమాను ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాలలో బ్యాన్ చేసింది జగన్ ప్రభుత్వం. దానితో సినిమా పేరుని గద్దలకొండ గణేష్ గా మార్చాల్సి వచ్చింది. ప్రభుత్వం కావాలనే చివరి నిముషంలో అటువంటి పని చేసిందని మెగా ఫ్యామిలీ ఉద్దేశం.

దీనితో ఇటువంటి షాక్ లు సైరాకు కూడా ఉండబోతున్నాయా అనే అనుమానాలు వారిలో ఉన్నాయి. జగన్ కు బాగా సన్నిహితంగా ఉండే వారితో ఆయనకు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారట చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సినిమాగా తీయాలని చిరంజీవి చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నారు. అది ఇప్పటికి కుదిరింది. చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి హిస్టారికల్ సినిమా ఇదే.

ADVERTISEMENT
Latest Stories